ఢిల్లీ రేప్ కేస్; యాప్-బేస్డ్ క్యాబ్ సేవలను నిషేధించిన ఢిల్లీ

By Ravi

దేశంలో అత్యాచారాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా కామాంధులలో మాత్రం ఎలాంటి మార్పులు రావటం లేదు. ఇటీవల ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్‌కు ఓ డ్రైవర్, పాతికేళ్లకు పైబడిన ఓ మహిళపై అత్యాచారం జరిపిన సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఈ సంఘటనను ఢిల్లీ సర్కారు సీరియస్‌గా తీసుకుంది.

క్యాబ్ సర్వీసులను అందించే కంపెనీలు డ్రైవర్లను నియమించుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా.. దేశరాజధాని ఢిల్లీలో రైడ్-షేరింగ్ సర్వీస్ ఉబెర్ అలాగే అన్ని యాప్-ఆధారిత క్యాబ్ సేవలను కూడా నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈజీ క్యాబ్, మెగా క్యాబ్, మెరూ క్యాబ్, ఛాన్సన్ క్యాబ్, యో క్యాబ్, ఎయిర్ క్యాబ్‌లకు మాత్రమే రేడియో టాక్సీలను ఆపరేట్ చేసేందుకు లైసెన్స్ ఉందని ఢిల్లీ రవాణా విభాగం పేర్కొంది. కాగా.. టాక్సీ ఫర్ షూర్, ఓలా, క్విక్ క్యాబ్స్, ఢిల్లీ క్యాబ్, వైన్ అండ్ కోజీ, ఉబెర్ వంటి దాదాపు 20 క్యాబ్ సర్వీసులను ఢిల్లీలో నిషేధించనున్నారు.

Uber Cabs Banned

ఒక్క ఉబెర్ సంస్థలోనే దాదాపు 3,000 మంది డ్రైవర్లు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి ఉబెర్ సంస్థ తమ స్వంత టాక్సీలను, డ్రైవర్లను నిర్వహించదు. చెల్లుబాటైన లైసెన్స్ లేదా స్వంత వాహనం కలిగిన డ్రైవర్ల నెట్‌వర్క్‌ను సేకరించి, వారికి కస్టమర్లను అప్పజెప్పుతుంటుంది. అంటే, కస్టమర్‌కు టాక్సీ డ్రైవర్‌కు మధ్య మీడియేటర్‌గా ఉబెర్ వ్యవరహిస్తుంటుంది.

ఓలా, టాక్సీ ఫర్ షూర్ వంటి కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఇలాంటి సేవలు అందించేటప్పుడు డ్రైవర్ల ఎంపిక విషయంలో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు ఇదివరకు ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, వారు తప్పనిసరిగా ఢిల్లీ స్టేట్ లైసెన్స్ కలిగి ఉండాలి, వారు నడిపే కార్లలో జిపిఎస్ ఉండాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే, ఇలాంటి సంఘటనలే పునరావృతమవుతాయి.

Most Read Articles

English summary
The Delhi government has banned all app-based cab services in New Delhi after the 25 year old woman was allegedly raped in Delhi. This move by the government could cause lots of inconvenience to everyday commuters, but keeping safety in mind, a step has to be taken.
Story first published: Tuesday, December 9, 2014, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X