జపనీస్ గ్రాండ్ ప్రిలో విషాదం; ఎఫ్1 డ్రైవర్ పరిస్థితి విషమం

By Ravi

ఫార్ములా వన్ రేస్ డ్రైవర్లకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఒక్కోసారి అంతే విషాదాన్ని కూడా ఇస్తుంది. తాజాగా జపనీస్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారష్యా ఎఫ్1 డ్రైవర్ మ్యాటియో బోన్సియానీ ట్రాక్‌పై నడుపుతున్న ఫెరారీ ఫార్ముా వన్ కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో సదరు డ్రైవర్ తలకి బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోన్సియానో పరిస్థితి సీరియస్‌గా ఉందనీ వైద్యుల చెబుతున్నారు. ఈ ప్రమాదానికి ఎఫ్1 నిర్వహాకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Jules Bianchi Critical But Stable

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ రేస్ నిర్వహించారని, రేస్ ట్రాక్ తడిసి ఉండటం వలన కారు ట్రాక్‌పై నుంచి జారిపోయిందని చెబుతున్నారు. మ్యాటియో బోన్సియానీ నడుపుతున్న ఫెరారీ కారు ట్రాక్‌పై నుంచి అదుపుతప్పి ట్రాక్‌కు పక్కగా నిలిచి ఉన్న రికవరీ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదత తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రమాదం వలన మ్యాటియో బోన్సియానీ తలకు బలమైన గాయం కావటంతో అతను స్పృహ కోల్పాయడు. ప్రస్తుతం జపాన్‌లోని యోకైచీలో ఉన్న మీ జనరల్ మెడికల్ సెంటర్‌లో అతనికి వైద్య సేవలు అందిస్తున్నారు.

Most Read Articles

English summary
Matteo Bonciani, International Automobile Federation (FIA) spokesman, told journalists that the French F1 driver, Jules Bianchi, is in a critical condition but stable.
Story first published: Tuesday, October 7, 2014, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X