'ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె' కారును సొంతం చేసుకున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్

By Ravi

ఇటాలియన్ సూపర్‌‌కార్ కంపెనీ ఫెరారీ, ఇటీవల ఆవిష్కరించిన సరికొత్త రేస్ ట్రాక్ వెర్షన్ లాఫెరారీ 'ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె' (FXX K) గుర్తుందా..? కేవలం 32 యూనిట్ల ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కార్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో, ఈ అరుదైన ఫెరారీ కారును సొంతం చేసుకునేందుకు, బిలియనీర్లు క్యూ కడుతున్నారు.

తాజాగా గూగుల్ ఎగ్జిక్యూటివ్ బెంజామిన్ స్లోస్ ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 జెనీవా మోటార్ షోలో ఫెరారీ ప్రదర్శించిన లాఫెరారీ హైపర్ కారును ఆధారంగా చేసుకొని, ఈ రేస్ స్పెసిఫిక్ ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును తయారు చేశారు. ఇదొక ట్రాక్-ఓన్లీ వెర్షన్ సూపర్ కారు (ట్రాక్ ఉపయోగం కోసం మాత్రమే).

Google Executive Buys Ferrari FXX K

బెంజామిన్ స్లోస్‌కు సూపర్ కార్లంటే చాలా క్రేజ్. ఆయన వద్ద ఫెరారీ 599ఎక్స్ఎక్స్ ఎవల్యూషన్, వొల్కానో రెడ్ మెక్‌లారెన్ 12సి స్పైడర్, వొల్కానో ఆరెంజ్ మెక్‌లారెన్ పి1, ఫెరారీ 458 ఇటాలియా, ఫోర్డ్ రాప్టార్ వంటి అరుదైన కార్లున్నాయి.

ఫెరారీ ఎఫ్ఎక్స్ఎక్స్ కె సూపర్‌కారులో వి12, 6.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 848 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని కెర్స్ హైబ్రిడ్ సిస్టమ్ 187 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 1,035 హార్స్‌పర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని ధర రూ.15 కోట్లకు పైనే ఉంటుంది.

Most Read Articles

English summary
Google Executive, Benjamin Sloss is the proud owner of one of the latest wonders in automobiles, the track only Ferrari FXX K. Keeping in mind, Sloss is one of only 32 lucky people who get to own the engineering marvel, the Ferrari FXX K.
Story first published: Wednesday, December 10, 2014, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X