భారతదేశంలో 15 ఏళ్లు నిండిన వాహనాలకి కాలం చెల్లు!?

By Ravi

భారతదేశంలో పాత వాహనాలకు కాలం చెల్లిపోనుంది. ఇక నుంచి ఏదైనా వాహన జీవితకాలం 15 ఏళ్లు మాత్రమే కానుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు నిండిపోయిన వాహనాలను ఢిల్లీ రోడ్ల నుంచి తొలగించి, స్క్రాప్‌గా మార్చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను భారతదేశపు ఆటోమోటివ్ పరిశ్రమ కూడా స్వాగతిస్తోంది.

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కాలం చెల్లిపోయిన, పాత వాహనల స్థానంలో అత్యాధునిక వాహనాలను ఉపయోగించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి మరో కారణం.

భారత ఆటోమోటివ్ పరిశ్రమలోని ఓ విభాగం ప్రకారం, ఇలాంటి పాతన వాహనాలను ఢిల్లీ రోడ్లపై నుంచి తొలగించడానికి బదులుగా, వీటిని స్క్రాప్‌గా మార్చేయాలని, లేదంటే ఇవి పక్క రాష్ట్రాలలో రిజిస్టర్ చేసుకొని, తిరిగి ఢిల్లీ రోడ్లపై వచ్చే ఆస్కారం ఉందని సదరు విభాగం భావిస్తోంది.

15 years old vehicle not allowed

ఈ విషయం గురించి భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విష్ణు మాథుర్ ప్రస్తావిస్తూ.. మోడ్రనైజేషన్ మరియు స్క్రాపింగ్ పాలసీ కోసం తాము ధీర్ఘ కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని అన్నారు.

ఈ చర్య వలన కేవలం కాలుష్యాన్ని కలిగించే వాహనాలను తొలగించడమే కాకుండా, మార్కెట్లోకి మరింత ఎక్కువ మైలేజీనిచ్చే మరియు తక్కువ కాలుష్యాన్ని కలిగించే వాహనాలకు స్వాగతం చెప్పేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

Most Read Articles

English summary
National Green Tribunal's directive to move out 15-year-old vehicles from the roads of Delhi has been welcomed by the automotive industry of India. This move would help reduce air pollution in the capital city of Delhi, feel the auto industry. It would also ensure modernisation.
Story first published: Saturday, November 29, 2014, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X