జేమ్స్ బాండ్ విలన్ కోసం 'జాగ్వార్ సి-ఎక్స్75' సూపర్‌కార్

By Ravi

జేమ్స్ బాండ్ చిత్రాలలో ఉపయోగించే కార్లకు ఎల్లప్పుడూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. జేమ్స్ బాండ్ పాత్రకు, ఆస్టన్ మార్టిన్ కార్లకు ఉన్న కనెక్షన్ ఇప్పటిది కాదు. తాజాగా వస్తున్న 'స్పెక్టేర్' చిత్రంలో కూడా జేమ్స్ బాండ్ పాత్రధారి ఓ సరికొత్త ఆస్టన్ మార్టిన్ డిబి10 కారును ఉపయోగించనున్న సంగతి తెలిసినదే. కాగా.. ఇదే చిత్రంలో విలన్ పాత్ర పోషించనున్న వ్యక్తి జాగ్వార్ కారును ఉపయోగించనున్నారు.

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్, గతంలో ఆవిష్కరించిన హైబ్రిడ్ సూపర్‌‌కార్ 'సి-ఎక్స్75' కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని తయారు చేసిన కారును స్పెక్టేర్ చిత్రంలో విలన్ కోసం ఉపయోగించనున్నారు. ప్రత్యేకించి సినిమా కోసం తయారు చేస్తున్న జాగ్వార్ సి-ఎక్స్75 కారులో, పలు మార్పులు చేర్పులు ఉండనున్నాయి. అయితే, ఈ చిత్రంలో హైబ్రిడ్ వెర్షన్‌కు బదులుగా కంప్లీట్ పెట్రోల్ వెర్షన్ మోడల్‌ను ఉపయోగించనున్నారు.

Jaguar C X75

ఈ జాగ్వార్ సి-ఎక్స్75 కారులో 5.0 లీటర్, వి8 సూపర్‌చార్జ్డ్ ఇంజన్‌ను అమర్చనున్నారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో జాగ్వార్ కార్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గత 2006లో వచ్చిన క్యాసినో రాయల్ చిత్రంలో జాగ్వార్ ఎక్స్‌జే8, ఎక్స్‌జేఆర్ మోడళ్లను ఉపయోగించారు. అలాగే, 2002లో వచ్చిన డై అనదర్ డే చిత్రంలో జాగ్వార్ ఎక్స్‌కేఆర్ కారును ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌కి పోటీగా ఉపయోగించారు.

జాగ్వార్ సి-ఎక్స్75 హైబ్రిడ్ సూపర్ కారు కాన్సెప్ట్‌ను కంపెనీ తొలిసారిగా 2010లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది. కాన్సెప్ట్ వెర్షన్ జాగ్వార్ సిఎక్స్-75 హైబ్రిడ్ మోడల్‌లో 1.6 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్/టోర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే, రెండు ఎలక్ట్రిక్ మోటర్లను (వెనుక భాగంలో) అమర్చారు. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 888 బిహెచ్‌పిల శక్తిని, 590 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం 2.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని, అలాగే 6 సెకండ్ల లోపే 0-160 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Jaguar C X75 Spectre Film
Most Read Articles

English summary
Aston Martin has recently revealed its bond car DB10. Now it is reported that, the Jaguar C-X75 supercar will also be featured in the upcoming James Bond film, Spectare. Stay tuned for latest updates.
Story first published: Tuesday, December 16, 2014, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X