Just In
Don't Miss
- Sports
సూపర్ సిరాజ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! ఆస్ట్రేలియా ఆధిక్యం 163!!
- Movies
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బెంగళూరులో తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించిన లాంబోర్గినీ
ఇటాలియన్ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ మేకర్ ఆటోమొబిలి లాంబోర్గినీ, నేడు (నవంబర్ 25, 2014) బెంగళూరులో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో లాంబోర్గినీ ఇండియాకి ఇదే తొలి షోరూమ్. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాల్లో రెండు లాంబోర్గిని షోరూమ్స్ ఉన్నాయి. కాగా.. బెంగళూరులో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌కి ఇండియాలో కెల్లా 3వ లాంబోర్గినీ షోరూమ్.
మొత్తం 4350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన లాంబోర్గినీ షోరూమ్‌లో కంపెనీ విక్రయిస్తున్న రెండు మోడళ్ల (అవెంటేడర్, హురాకన్)ను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. బెంగళూరులో ఈ కొత్త షోరూమ్‌ను ఆటోమొబిలి లాంబోర్గినీ స్పా ప్రెసిడెంట్, సీఈఓ స్టీఫెన్ వింకిల్‌మ్యాన్ ప్రారంభించారు. లాంబోర్గినీ బెంగళూర షోరూమ్ చిరునామా:
Hoysala Automotives Pvt. Ltd.
# 19/1 Doddamane,
Near Vittal Mallya Road-Lavelle Road Junction,
Bengaluru - 560001
భారతదేశపు దక్షిణాధి రీజియన్లలో తమ సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే దిశగా లాంబోర్గినీ బెంగళూరులో ఈ షోరూమ్‌ని ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన హురాకన్ ఎల్పి 610-4, అవెంటేడర్ రోడ్‌స్టర్ ఎల్పి 700-4, అవెంటేడర్ కబప్ ఎల్పి 700-4 మోడళ్లను విక్రయించనున్నారు.
