వచ్చే ఏడాది ఆరంభంలో డిసి అవంతి స్పోర్ట్స్ కార్ లాంచ్

మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కార్ 'డిసి అవంతి' (DC Avanti) గుర్తుందా.. వెహికల్ కస్టమైజేషన్ దిగ్గజం, ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియాకు చెందిన 'డిసి డిజైన్స్' సంస్థ తొలిసారిగా జనవరి 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ కారును వచ్చే ఏడాది ఆరంభం నుంచి వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 ఆచో ఎక్స్‌పోలో డిసి డిజైన్స్ తమ అవంతిలో ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కాన్సెప్ట్ కారుకు, ప్రొడక్షన్ వెర్షన్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. డిసి డిజైన్స్ తమ అవంతి స్పోర్ట్స్ కారును గుజరాత్‌లోని సనంద్ పారిశ్రామిక ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 3500 యూనిట్లు.


డిసి అవంతి కారు 4550 మి.మీ. పొడవును, 1965 మి.మీ. వెడల్పును, 120 మి.మీ. ఎత్తును మరియు 2700 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. ఇదొక టూ-సీటర్ స్పోర్ట్స్ కార్. ఇండియన్ రోడ్ కండిషన్స్‌కి అనుగుణంగా తయారు చేసిన ఈ కారులో 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 255/35 టైర్లు, వెనుక వైపు 295/30 టైర్లను ఉపయోగించారు.

ఈ కారులో 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 250 బిహెచ్‌పిల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ కారు మధ్య భాగంలో (మిడ్-ఇంజన్) అమర్చబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది (రియల్ వీల్ డ్రైవ్).

DC Avanti Rear

డిసి అవంత బాడీ కార్బన్ కాంపోసైట్ మెటీరియల్‌తో తయారు చేయటం వలన ఇది తేలిక బరువును కలిగి ఉంటుంది. కంపెనీ తమ బ్రోచర్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది 1562 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. ముందు, వెనుక డబువ్ విష్ బోన్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేసింగ్ సిస్టమ్) స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

బై-హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. దాదాపు రూ.35 లక్షల విలువ చేసే ఈ కారులో బహుశా ఎయిర్‌బ్యాగ్స్ లేవని తెలుస్తోంది (బ్రోచర్‌లో వీటి గురించి పేర్కొనలేదు). డిసి అవంతి 10 రంగులలో లభ్యం కానుంది. మొదటి బ్యాచ్ డిసి అవంతి (500 యూనిట్లు) ఇప్పటికే బుక్ అయిపోయినట్లు సమాచారం. వీటి డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
DC Avanti sports car's brochure is revealed in internet. Here are given the DC Avanti car's technical specifications and features. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X