మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆటోమేటిక్ వెర్షన్ వస్తోంది

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ మోడల్ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' ఎస్‌యూవీకి లభిస్తున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతోన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఆరంభంలో శాంగ్‌యాంగ్ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనుంది.

ఈ శాంగ్‌యాంగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మహీంద్రా ఎక్స్‌యూవీ500లో కూడా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

Mahindra XUV500 Automatic

వాస్తవానికి మహీంద్రా ఎక్స్‌యూవీ ఆటోమేటిక్ వేరియంట్ ఎప్పుడో మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, మహీంద్రా వాహనాల్లో (ప్రత్యేకించి స్కార్పియోలో) ఉపయోగించే సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆస్ట్రేలియాకు చెందిన డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్ ఇంటర్నేషల్ (డిఎస్ఐ) సరఫరా చేసేది.

అయితే, డిఎస్ఐకు ప్రధాన కస్టమర్ అయిన శాంగ్‌యాంగ్ దివాళా తీయడంతో, శాంగ్‌యాంగ్‌ను మహీంద్రా సొంతం చేసుకోగా, డిఎస్ఐను చైనాకు చెందిన గీలే కంపెనీ స్వాధీనం చేసుకుంది. మహీంద్రా-శాంగ్‌యాంగ్ స్వాధీనం పూర్తయిన తర్వాత తిరిగి ఈ ఇరు బ్రాండ్‌ల మధ్య విడిభాగాల సరఫరా పునఃప్రారంభం కానుంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, అనుకున్న సమయం కంటే ముందుగానే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆటోమేటిక్ వేరియంట్ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 నాలుగు వేరియంట్లలో (డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8 ఆల్-వీల్ డ్రైవ్) లభ్యమవుతోంది. ఇందులో 2179సీసీ ఎమ్-హాక్140 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Mahindra's flagship SUV, the XUV500 does not come in an automatic transmission variant and that's surprising considering the vehicle's popularity and more so because of its placement as a global product. However, that's not missed Mahindra and the Indian automaker is said to considering introducing an automatic gearbox for the XUV500 in the near future.
Story first published: Friday, February 21, 2014, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X