పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరగవచ్చు: మారుతి సుజుకి

By Ravi

ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో పెట్రోల్‌ కార్లకు డిమాండ్‌ పెరగవచ్చునని దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భావిస్తోంది. 'డీజిల్ ధరపై నియంత్రణలు ఎత్తివేయటం మరియు పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారని' కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు వాణిజ్య వ్యాపారం చీఫ్‌ ఎస్‌ ఎన్‌ బర్మన్‌ అన్నారు.

ప్రస్తుతం డీజిల్‌ కార్ల విక్రయాలు 30 శాతంగా ఉంటే, పెట్రోల్‌ కార్ల అమ్మకాలు 70 శాతంగా ఉన్నాయని, మారుతి సుజుకిలో పెట్రోల్ కార్లే అధికంగా అమ్ముడుపోతున్నాయని, ఈ విభాగంలో లభిస్తున్న ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ కార్లకు మంచి గిరాకీ ఉందని ఆయన చెప్పారు.

Maruti Expects Petrol Cars Demand May Increase

కలకత్తాలో కొత్త ఆల్టో కె10 కారును విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమ ట్రెండ్ ప్రకారం డీజిల్‌ కార్ల విక్రయాలు 45 శాతం, పెట్రోల్‌ వాహనాల అమ్మకాలు 55 శాతంగా ఉన్నాయి. ఒకవేళ పెట్రోల్‌ కార్లకు డిమాండ్‌ మరింత పెరిగితే, అందుకు తగినట్లుగా కార్లను సరఫరా చేసేందుకు గాను, పెట్రోల్ కార్ల ఉత్పత్తి పెంచడానికి మారుతి సుజుకి సిద్ధంగా ఉందని బర్మన్‌ అన్నారు.
Most Read Articles

English summary
Country’s largest passenger car maker Maruti Suzuki is expecting a shift towards petrol vehicles with the recent deregulation of diesel by the government.
Story first published: Thursday, November 6, 2014, 9:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X