మెక్‌లారెన్ పి1 జిటిఆర్ రేస్ కార్ ఆవిష్కరణ

By Ravi

ప్రముఖ బ్రిటీష్ సూపర్‌కార్ కంపెనీ మెక్‌లారెన్ తన అభిమానుందలరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ సరికొత్త హైపర్ కారును ఆవిష్కరించింది. మెక్‌లారెన్ పి1 జిటిఆర్ (McLaren P1 GTR) అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ కారును ప్రత్యేకించి రేస్ ట్రాక్ కోసం మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఇదొక ఆల్ట్రా ఎక్స్‌క్లూజివ్ వెహికల్.

మెక్‌లారెన్ పి1 జిటిఆర్ కారులో పవర్‌ఫుల్ 3.8 లీటర్, వి8, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌తో పాటుగా ఇందులో ఆల్ట్రా లైట్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 986 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

mclaren p1 gtr design concept has been unveiled

ప్రపంచంలో కెల్లా బెస్ట్ డ్రైవర్స్ కారును తయారు చేయాలనే తమ ఏకైక లక్ష్యంలో భాగంగా ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. మెక్‌లారెన్ పి1 జిటిఆర్ కారును కేవలం రేస్ ట్రాక్ కోసమే తయారు చేసిన నేపథ్యంలో, దీని విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ కారును మెక్‌లారెన్ స్పెషల్ ఆపరేషన్స్ విభాగం తయారు చేసింది.

మెక్‌లారెన్ పి1 జిటిఆర్ ఇప్పటి వరకు తయారు చేయబడని అత్యంత శక్తివంతమైన ట్రాక్ ఓరియెంటెడ్ సూపర్‌కార్. తమ పి1 జిటిఆర్ కారు తయారీ కోసం మెక్‌లారెన్ చాలానే సమయం వెచ్చించింది. ఫార్ములా వన్ వంటి అనేక మోటార్స్‌స్పోర్ట్స్ వాహనాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశారు. స్లిక్ టైర్స్, ఏరోడైనమిక్ ఎక్స్టీరియర్, ఫిక్స్డ్ రైడ్ హైట్, డిఆర్ఎస్, ఈఆర్ఎస్, ఐపాస్ పవర్‌ట్రైన్ వంటి అనేక విశిష్టతలు దీని సొంతం.

mclaren p1 gtr design concept unveiled

ఈ రేస్ పర్పస్ మెక్‌లారెన్ పి1 జిటిఆర్ కారును స్ట్రీట్ లీగల్ మెక్‌లారెన్ పి1 మోడల్ ఆధారంగా తయారు చేశారు. అయితే, ఏరోడైనమిక్స్‌ను ఇంప్రూవ్ చేసేందుకు గాను దీని బాడీవర్క్‌ను రీడిజైన్ చేశారు. ఇది సుపీరియర్ పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టైర్లను త్వరగా మార్చుకునేందుకు మెక్‌లారెన్ పి1 జిటిఆర్‌లో ఆన్‌బోర్డ్ ఎయిర్ జాకింగ్ సిస్టమ్‌న అమర్చారు. బెటర్ ఏరోడైమిక్స్ కోసం వెనుక వైపు పెద్ద ట్విన్ ఎలిమెంట్ ఏరోడైనమిక్ వింగ్‌ను అమర్చారు. ఈ రియర్ వింగ్‌కు దిగువన మధ్య భాగంలో సైలెన్సర్‌ను అమర్చారు. ఈ కారును కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేశారు.

Most Read Articles

English summary
McLaren has been teasing its fans and followers with its P1 GTR. They had earlier revealed a few glimpses of the super car. Now they have finally pulled the covers off their P1 GTR, an ultra exclusive vehicle meant for track use.
Story first published: Saturday, August 16, 2014, 16:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X