Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెక్లారెన్ పి1 జిటిఆర్ రేస్ కార్ ఆవిష్కరణ
ప్రముఖ బ్రిటీష్ సూపర్‌కార్ కంపెనీ మెక్లారెన్ తన అభిమానుందలరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ సరికొత్త హైపర్ కారును ఆవిష్కరించింది. మెక్లారెన్ పి1 జిటిఆర్ (McLaren P1 GTR) అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ కారును ప్రత్యేకించి రేస్ ట్రాక్ కోసం మాత్రమే కంపెనీ తయారు చేసింది. ఇదొక ఆల్ట్రా ఎక్స్‌క్లూజివ్ వెహికల్.
మెక్లారెన్ పి1 జిటిఆర్ కారులో పవర్ఫుల్ 3.8 లీటర్, వి8, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌తో పాటుగా ఇందులో ఆల్ట్రా లైట్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 986 హార్స్ పవర్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
ప్రపంచంలో కెల్లా బెస్ట్ డ్రైవర్స్ కారును తయారు చేయాలనే తమ ఏకైక లక్ష్యంలో భాగంగా ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. మెక్లారెన్ పి1 జిటిఆర్ కారును కేవలం రేస్ ట్రాక్ కోసమే తయారు చేసిన నేపథ్యంలో, దీని విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఈ కారును మెక్లారెన్ స్పెషల్ ఆపరేషన్స్ విభాగం తయారు చేసింది.
మెక్లారెన్ పి1 జిటిఆర్ ఇప్పటి వరకు తయారు చేయబడని అత్యంత శక్తివంతమైన ట్రాక్ ఓరియెంటెడ్ సూపర్‌కార్. తమ పి1 జిటిఆర్ కారు తయారీ కోసం మెక్లారెన్ చాలానే సమయం వెచ్చించింది. ఫార్ములా వన్ వంటి అనేక మోటార్స్స్పోర్ట్స్ వాహనాల నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశారు. స్లిక్ టైర్స్, ఏరోడైనమిక్ ఎక్స్టీరియర్, ఫిక్స్డ్ రైడ్ హైట్, డిఆర్ఎస్, ఈఆర్ఎస్, ఐపాస్ పవర్ట్రైన్ వంటి అనేక విశిష్టతలు దీని సొంతం.
ఈ రేస్ పర్పస్ మెక్లారెన్ పి1 జిటిఆర్ కారును స్ట్రీట్ లీగల్ మెక్లారెన్ పి1 మోడల్ ఆధారంగా తయారు చేశారు. అయితే, ఏరోడైనమిక్స్‌ను ఇంప్రూవ్ చేసేందుకు గాను దీని బాడీవర్క్‌ను రీడిజైన్ చేశారు. ఇది సుపీరియర్ పెర్ఫార్మెన్స్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
టైర్లను త్వరగా మార్చుకునేందుకు మెక్లారెన్ పి1 జిటిఆర్లో ఆన్‌బోర్డ్ ఎయిర్ జాకింగ్ సిస్టమ్‌న అమర్చారు. బెటర్ ఏరోడైమిక్స్ కోసం వెనుక వైపు పెద్ద ట్విన్ ఎలిమెంట్ ఏరోడైనమిక్ వింగ్‌ను అమర్చారు. ఈ రియర్ వింగ్‌కు దిగువన మధ్య భాగంలో సైలెన్సర్‌ను అమర్చారు. ఈ కారును కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేశారు.