ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో కొత్త ఆల్టో కె10

By Ravi

మేడ్ ఇన్ ఇండియా ఆల్టో కె10 త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ ఆల్టో కె10 కారును ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మారుతి సుజుకి పేర్కొంది.

కొత్త ఆల్టో కె10 కారును ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్లకు ఎగుమతి చేయాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఇండియా ఉపాధ్యక్షుడు (విడిభాగాలు) అమితవ రాయ్ కేరళలో ఈ కొత్త ఆల్టో కె10 విడుదల చేసిన సందర్భంగా అన్నారు.

కొత్త మారుతి ఆల్టో కె10లోని కంప్లీట్ ఫీచర్స్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మారుతి సుజుకి గడచిన సంవత్సరంలో మొత్తం 11 లక్షలకు పైగా కార్లను విక్రయించిందని, ఈ ఏడాది అదనంగా మరో 10 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ఓ ఎంట్రీ లెవల్ కారులో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్‌ను బిగించడం దేశంలోనే ఇదే ప్రప్రథమమని అన్నారు.

New Alto K10 Export

ఈ సరికొత్త మారుతి ఆల్టో కె10 విషయానికి వస్తే.. కంపెనీ రెండేళ్ల క్రితం విడుదల చేసిన ఆల్టో 800 మోడల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అదే డిజైన్ ఫిలాసఫీతో దీనిని తయారు చేశారు. ఇందులో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

కొత్త ఆల్టో కె10లో ఇంప్రూవ్డ్ 998సీసీ, 3-సిలిండర్, కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌‌తో పాటుగా, సెలెరియో ద్వారా కొత్తగా పరిచయం చేసిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా ఆఫర్ చేస్తున్నారు.

మునుపటి ఆల్టో కె10తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆల్టో కె10 మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం.. పెట్రోల్ వెర్షన్ ఆల్టో కె10 లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
India’s largest car maker, Maruti Suzuki, plans to export its next generation small car Alto K10 to Africa, Latin America and the Middle East, a top official said.
Story first published: Thursday, November 6, 2014, 12:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X