హైదరాబాద్ మార్కెట్లో కొత్త మారుతి ఆల్టో కె10 విడుదల

మారుతి సుజుకి ఇండియా ఈనెల 3వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త ఆల్టో కె10 కారును కంపెనీ తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. రాష్ట్ర విపణిలో ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో కె10 ప్రారంభ ధరను రూ.3.18 లక్షలు (బేస్ వేరియంట్, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా నిర్ణయించారు.

కొత్త మారుతి ఆల్టో కె10లోని కంప్లీట్ ఫీచర్స్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కంపెనీ అందిస్తున్న ఆల్టో 800 మోడల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, అదే డిజైన్ ఫిలాసఫీతో ఈ కొత్త ఆల్టో కె10 మోడల్‌ను తయారు చేశారు. ఇందులో అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

కొత్త ఆల్టో కె10లో ఇంప్రూవ్డ్ 998సీసీ, 3-సిలిండర్, కె10 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 9.1 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌‌తో పాటుగా, సెలెరియో ద్వారా కొత్తగా పరిచయం చేసిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా ఆఫర్ చేస్తున్నారు.

మునుపటి ఆల్టో కె10తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆల్టో కె10 మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం.. పెట్రోల్ వెర్షన్ ఆల్టో కె10 లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. దేశీయ విపణిలో 2015 ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

New Maruti Suzuki Alto K10 Launched In Hyderabad

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 వేరియంట్లు, ధరలు:

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ - రూ.3.18 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ - రూ.3.34 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ - రూ.3.50 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.3.70 లక్షలు

* ఆల్టో కె10 విఎక్స్ఐ (ఆటోమేటిక్) - రూ.3.94 లక్షలు

* ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి) - రూ.3.95 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Most Read Articles

English summary
Maruti Suzuki has launched its next-gen Alto K10 hatchback in Hyderabad at Rs 3.18 lakh (ex-showroom, Hyderabad). The Japanese manufacturer has given its Alto K10 a much needed facelift. It is targeted at people who are more budget conscious and trust the brand name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X