టాటా మోటార్స్ ఫాల్కన్ 4 హ్యాచ్‌బ్యాక్ పేరు 'టాటా బోల్ట్'

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఫాల్కన్ 4, ఫాల్కన్ 5 కోడ్‌నేమ్‌లతో నెక్స్ట్ జనరేషన్ విస్టా హ్యాచ్‌బ్యాక్ మరియు నెక్స్ట్ జనరేషన్ మాంజా సెడాన్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ ఫాల్కన్ 4 హ్యాచ్‌బ్యాక్‌కు 'బోల్ట్' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సరికొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఫిబ్రవరి 3, 2014వ తేదీన లాంఛనంగా విడుదల చేసి, ఆ తర్వాత ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీగా టాటా తమ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టనుంది.

Tata Vista D90

టాటా మోటార్స్ ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో తమ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటుగా ఓ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ సెడాన్ (ఫాల్కన్ 5)ను కూడా విడుదల చేయనుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా నిలువనుంది. ఈ రెండు కార్లు కూడా సరికొత్త పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

పెట్రోల్ వెర్షన్లలో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన 1.2 లీటర్ రెవోట్రాన్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుత విస్టాతో పోల్చుకుంటే, నెక్స్ట్ జనరేషన్ విస్టా (టాటా బోల్ట్) డిజైన్, ఫీచర్ల పరంగా అనేక రెట్లు మెరుగ్గా, అధునాతంగా ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2014, 12:32 [IST]
English summary
Tata Falcon hatchback, set to go on display at 2014 Auto Expo has got a new name. Christened ‘Bolt’, the upcoming hatchback will be formally unveiled in New Delhi on February 3, 2014, while it will also be displayed at the 2014 Auto Expo alongside a sub-four meter sedan, currently called Falcon 5.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+