బెంగుళూరులో వోల్వో బస్ సెంటర్ ప్రారంభం

By Ravi

స్వీడన్‌కు చెందిన బస్సుల తయారీ సంస్థ వోల్వో బెంగుళూరులో 'వోల్వో బస్‌ సెంటర్‌'ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో వోల్వో సర్వీసులు, ప్రమాదాల నివారణ, మరమ్మతులు, వోల్వో నాణ్యమైన విడిభాగాలు, డ్రైవర్‌ శిక్షణ, సలహా సూచనలతో పాటు ఇతర సేవలపై పూర్తి సమాచారాన్ని ప్రయాణికులకు, వివిధ ట్రావెల్‌ ఏజెన్సీలకు అందించే ఏర్పాట్లు చేస్తామని కంపెనీ పేర్కొంది.

ఇటీవల కాలంలో పలు వోల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం మరియు సదరు బస్సులలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించామని వోల్వో వివరించింది. ఈ వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా సాఫ్ట్‌‌‌వేర్‌ ఉద్యోగులు వోల్వో సేవలపై ఆధారపడటం తెలిసినదే.

Volvo Bus

జిగనీ లింక్‌రోడ్డ్‌ సమీపలోని బొమ్మసంద్ర కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి మండలి పరిశ్రమల కేంద్రంలో ఈ వోల్వో బస్ సెంటర్‌‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 43,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 16 బేలు ఉంటాయి. ఈ కేంద్రంలో ప్రతీరోజూ సుమారు 15 నుండి 20 వోల్వో సర్వీసులుపై పూర్తి వివరాలు అందిస్తూ, బెంగుళూరుకు సమీపంలోని వివిధ ప్రధాన రూట్లలో సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇటీవల మహబూబ్‌ నగర్‌ జిల్లా, పాలెం వద్ద చోటు చేసుకున్న ఘోర ప్రమాద వోల్వో బ్ససు ప్రమాద సంఘటన అనంతరం వోల్వో బస్సుల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విమర్శలు, సీఐడీ బృందం రూపొందించిన నివేదికలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వోల్వో సంస్థ ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Volvo Buses inaugurated its ‘Volvo Bus Center’ in Bangalore. The Volvo Bus Centre in Bangalore is spread across 43,000 square feet and comprises 16 bays. The offerings will include service, accident repairs, Volvo Genuine parts, driver training, advisory and refurbishment among other support services.
Story first published: Wednesday, March 19, 2014, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X