ఐఐహెచ్ఎస్ క్రాష్ టెస్ట్‌లో టాప్ రేటింగ్ పొందిన ఆడి ఏ3
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి తయారు చేస్తున్న ఏ3 మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ సేఫ్టీలో బెస్ట్ అనిపించుకుంది. మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ తక్కువ ధర కలిగిన ఆడి లగ్జరీ కారు అత్యంత సురక్షితమైన కారుగా పేరు తెచ్చుకుంది.
యూఎస్ ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైవే సేఫ్టీ (ఐఐహెచ్ఎస్) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఆడి ఏ3 సెడాన్ టాప్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టులో 2015 ఆడి ఏ3 సెడాన్ టాప్ సేఫ్టీ పిక్ ప్లస్ పేరును సొంతం చేసుకుంది. ఇది ఐఐహెచ్ఎస్ అందిస్తున్న అత్యధిక సేఫ్టీ రేటింగ్ కావటం విశేషం.

ఈ కొత్త 2015 ఆడి ఏ3 సెడాన్ ప్రతి విభాగంలో మంచి (గుడ్) రేటింగ్‌ను సంపాధించుకుంది. స్మాల్ ఓవర్‌ల్యాంప్ ఫ్రంట్ క్రాష్ టెస్ట్‌లో 25 శాతం వాహన ముందు భాగం దెబ్బ తింటుంది. చాలా కార్లు ఈ టెస్టులో విఫలం అవుతుంటాయి, కానీ ఆడి ఏ3 మాత్రం సునాయాసంగా ఈ టెస్ట్ పాస్ అయ్యింది.

ఐఐహెచ్ఎస్ నిర్వహించిన స్మాల్ ఓవర్‌ల్యాప్ ఫ్రంట్ క్రాష్ టెస్టును మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NXa-TeBOkk0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








