2015 డెట్రాయిట్ ఆటో షో: ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ ఆవిష్కరణ
ఇటాలియన్ కార్ కంపెనీ 'ఆల్ఫా రోమియో' (Alfa Romeo) తమ సరికొత్త '4సి స్పైడర్' (4C Spider) కారును డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ఆవిష్కరించింది. ఇది ప్రొడక్షన్ వెర్షన్ ఆల్ఫా రోమియో 4సి స్పైడర్.
ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ ఓ ఓపెన్ టాప్ కారు (కావాలనుకుంటే రూఫ్‌ను అమర్చుకోవచ్చు). దీని ఇంజన్, ఎగ్జాస్ట్‌లను ఇటాలియన్ కంపెనీ ప్రత్యేకంగా ట్యూన్ చేసింది. దీని కూపే వెర్షన్ (ఆల్ఫా రోమియో 4సి కూపే) మాదిరిగానే, ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ మోడల్‌ను కూడా సరికొత్త ఆల్ట్రా-లైట్‌వెయిట్ మోనోకాక్ షాషీపై నిర్మించారు.
ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

ఈ కారు తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించడం వలన దీని బరువు తేలికగా ఉండి, మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఆల్ఫా రోమియో 4సి కూపే కారులోని అనేక డిజైన్ ఫీచర్లను ఆల్ఫా రోమియో 4సి స్పైడర్‌లో కూడా గమనించవచ్చు. ఈ రెండు కార్లలో ప్రధానమైన మార్పు రూఫ్ మాత్రమే అని చెప్పొచ్చు.

ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారులో చెప్పుకోదగిన మరో విశిష్టమైన ఫీచర్, ఇందులోని సరికొత్త, టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్. కారు సెంటర్‌లో ఉండే ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్‌కి స్విచబల్ మోడ్స్ ఉంటాయి, దీనిని డ్రైవింగ్ వాతావరణాన్ని, డ్రైవర్ మూడ్‌ని బట్టి మార్చుకోవచ్చు.

ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారులోని ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎగ్జాస్ట్ స్పెషలిస్ట్ అక్రాపోవిక్ డిజైన్ చేసింది. ఆల్ఫా రోమియో 4సి కూపే మాదిరిగానే 4సి స్పైడర్ కూడా స్టాండర్డ్, రేసింగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆప్షన్స్‌తో లభిస్తుంది.

యూఎస్ వెర్షన్ ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారులో సరికొత్త ఆల్పైన్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఇది మల్టిపుల్ కనెక్టివిటీలను, మీడియా ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది.

ఆల్ఫా రోమియో 4సిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్స్‌కు ఆదనంగా కంపెనీ మరో సరికొత్త కలర్‌ను చేర్చింది. ఇది ఇప్పుడు గియాల్లో (పసుపు) రంగులో కూడా లభ్యం కానుంది.

అంతేకాకుండా.. ఈ మోడల్ కోసం కంపెనీ నాలుగు కొత్త వీల్ డిజైన్స్ కూడా పరిచయం చేసింది. ఇవి ముందు వైపు 17 ఇంచ్, వెనుక వైపు 18 ఇంచ్ లేదా ముందు వైపు 18 ఇంచ్, వెనుక వైపు 19 ఇంచ్ సైజులలో సిల్వర్ లేదా డార్క్ ఫినిషింగ్‌లో లభ్యం కానున్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. 4సి కూపేలో ఉపయోగిస్తున్న 240 హెచ్‌పి, 1750 టిబిఐ ఇంజన్‌నే ఈ కొత్త 4సి స్పైడర్‌లోను ఉపయోగిస్తున్నారు. అయితే, దీని ఇంజన్ పవర్‌ను మాత్రం కొద్దిగా ట్యూన్ చేశారు.

ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారు గరిష్టంగా గంటకు 160 మైళ్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 4.1 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

నార్త్ అమెరికన్ మార్కెట్ కోసం ఆల్ఫా రోమియో 4సి స్పైడర్‌ను ధృడమైన స్ప్రింగ్స్, పెద్ద ఫ్రంట్ అండ్ రియర్ యాంటీ రోల్ బార్స్, రీట్యూన్ షాక్ అబ్జార్వర్స్‌తో డిజైన్ చేశారు.

ఆల్ఫా రోమియో 4సి స్పైడర్ కారును ఆల్ఫా రోమియో సెంట్రో స్టైల్ డిజైన్ చేశారు. ఈ కారును ఇటలీలోని మోడెనాలో ఉన్న మాసేరటి ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఏడాది వేసవిలో ఇది యూకే మార్కెట్లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








