2015 డెట్రాయిట్ ఆటో షో: ఫోర్డ్ జిటి సూపర్‌కారు ఆవిష్కరణ

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్, డెట్రాయిట్‌లో జరుగుతున్న 2015 నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ఓ సరికొత్త హై-పెర్ఫార్మెన్స్ సూపర్‌కారును ఆవిష్కరించింది. డెట్రాయిట్ ఆటో షో 2015లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఈ సరికొత్త సూపర్‌కారు పేరు 'ఫోర్డ్ జిటి'. బెటర్ ఏరోడైనమిక్స్, లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్ బాడీ, ఈకోబూస్ట్ పెర్ఫార్మెన్స్ ఇంజన్‌లతో ఈ కారును డిజైన్ చేశారు.

ఫోర్డ్ మోటార్స్ 2020 నాటికి విడుదల చేయాలని భావిస్తున్న 12 పెర్ఫార్మెన్స్ వాహనాలలో ఒకటి. ఈ కొత్త ఫోర్డ్ జిటి కారు ప్రస్తుతం ఫోర్డ్ అందిస్తున్న పెర్ఫార్మెన్స్ వాహనాలు ఫోకస్ ఆర్ఎస్, ఎఫ్-150 రాప్టర్, షెల్బీ జిటి350, షెల్బీ జిటి350ఆర్ మోడళ్ల సరసన చేరనుంది. వచ్చే ఏడాది (2016)లో ఫోర్డ్ జిటి కారు ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

తర్వాతి స్లైడ్‌‌లలో ఫోర్డ్ జిటి సూపర్‌కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

వచ్చే ఏడాది ఫోర్డ్ తమ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కొత్త జిటి సూపర్‌కారును మార్కెట్లో విడుదల చేయనుంది.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఫోర్డ్ జిటి ఓ ఆల్-వీల్ డ్రైవ్, 2-సీటర్, 2-డోర్ స్పోర్ట్స్ కారు. ఫోర్డ్ రేసింగ్ మరియు పెర్ఫార్మెన్స్ కార్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ సరికొత్త జిటి సూపర్‌కారును డిజైన్ చేశారు.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఫోర్డ్ జిటి సూపర్‌కారులో 3.5 లీటర్ ఈకోబూస్ట్ వి6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఈకోబూస్ట్ ఇంజన్లలో కెల్లా అత్యంత శక్తివంతమైన ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 600 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఇంజన్ రెస్పాన్స్‌ని ఇంప్రూవ్ చేసేందుకు ఫోర్డ్ జిటి కారులో సరికొత్త పోర్ట్/డైరెక్ట్ డ్యూయెల్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సెటప్‌ను ఉపయోగించారు. ఇందులోని ట్విన్-టర్బో ఈకోబూస్ట్ వి6 ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఫోర్డ్ జిటి సూపర్‌కారును కార్బన్ ఫైబర్, అల్యూమినియం వంటి తేలికపాటి పదార్థాలను ఉపయోగించి తయారు చేశారు. ఫలితంగా ఈ కారు బరువు తక్కువగా ఉండి, ఇది ఎక్కువ పెర్ఫార్మెన్స్‌ను మరియు మంచి మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఫోర్డ్ జిటి సూపర్‌కారులో అధునాత సాంకేతిక వ్యవస్థను ఆఫర్ చేయనున్నారు. ఇందులో ఫోర్డ్ అడ్వాన్స్డ్ కనెక్టివిటీ సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ 'సింక్ 3'ని ఆఫర్ చేయనున్నారు.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

ఈ సూపర్‌కారులో పెద్ద 20 ఇంచ్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, మిషెల్లిన్ పైలట్ సూపర్ స్పోర్ట్ కప్ 2 టైర్లను ఆఫర్ చేయనున్నారు. ఇవి హై-స్పీడ్ వద్ద మంచి రోడ్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి.

ఫోర్డ్ జిటి సూపర్‌కారు

నాలుగు చక్రాలలోను కార్బన్-సెరామిక్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్క్ బ్రేక్స్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)కు అనుసంధానం చేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
Ford unveiled the all-new GT, an ultra-high-performance supercar that serves as a technology showcase for top EcoBoost® performance, aerodynamics and lightweight carbon fiber construction.
Story first published: Friday, January 16, 2015, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X