న్యూయార్క్ ఆటో షో: 2015 హోండా హెచ్ఆర్-వి ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ హోండా నెక్స్ట్ జనరేషన్ జాజ్ (ఫిట్) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ప్రొడక్షన్ వెర్షన్ 'హోండా హెచ్ఆర్-వి' కాంపాక్ట్ ఎస్‌యూవీని న్యూయార్క్‌లో జరుగుతున్న 2014వ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది.
మరికొద్ది నెలల్లో హోండా హెచ్ఆర్-వి క్రాసోవర్ గ్లోబల్ మార్కెట్లలో వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. హోండా గతంలో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో ఇలాంటి ఓ అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసినదే.

హోండా హెచ్ఆర్-వి డైమండ్ ఆకారపు హెడ్‌లైట్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌తో ఆకర్షనీయమైన ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. షెవర్లే బీట్ మాదిరిగా వెనుక డోర్ హ్యాండిల్స్‌ను, వెనుక డోరు అద్దానికి చివరి భాగంలో అమర్చబడి ఉంటాయి.
హోండా హెచ్ఆర్-విలో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో టర్బోచార్జ్డ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హోండా హెచ్ఆర్-వి క్రాసోవర్ భారత్ వంటి మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. ఆసియా మార్కెట్ల కోసం ఇందులో డీజిల్ ఇంజన్ వేరియంట్‌ను (ప్రస్తుతం సిటీ, అమేజ్‌లలో ఉపయోగిస్తున్న డీజిల్ ఇంజన్) కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








