2015 హ్యుందాయ్ జెనిసిస్ కారు విడుదల - ఫీచర్స్
కొరియాకు చెందిన ప్రముఖ ఆటో దిగ్గజం హ్యుందాయ్ తమ సరికొత్త ప్రీమియం సెడాన్ 'హ్యుందాయ్ జెనిసిస్' (Hyundai Genesis)ను అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త జెనిసిస్ రెండవ తరానికి (సెకండ్ జనరేషన్) చెందినది. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వంటి లగ్జరీ కార్లతో పోటీపడే ఈ కొత్త హ్యుందాయ్ జెనిసిస్ ముందుగా కొరియన్ మార్కెట్లో విడుదల కానుంది.
అనంతరం, యూరప్, చైనా, రష్యా మొదలైన దేశాల్లో విడుదల కానుంది. రానున్న డెట్రాయిట్ మోటార్ షోలో హ్యుందాయ్ ఈ కొత్త జెనిసిస్ కారును ప్రదర్శించనుంది. ప్రస్తుతం మన దేశంలో లగ్జరీ కార్లకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ కొత్త జెనిసిస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ కొత్త హ్యుందాయ్ జెనిసిస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొత్త 2015 హ్యుందాయ్ జెనిసిస్ కారును కంపెనీ యొక్క 'ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా చేసుకొని అభివృదధి చేశారు. ఈ డిజైన్‌లో పెద్ద కొత్త హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, హారిజాంటల్ బార్స్‌తో మంచి స్పోర్టీ అండ్ ప్రీమియం లుక్‌నిస్తుంది.

కొరియన్ మార్కెట్లో విడుదల కానున్న హ్యుందాయ్ జెనిసిస్ నాలుగు విభిన్న ఇంజన్ ఆప్షన్ల (వి6, వి8 పెట్రోల్ ఇంజన్స్)తో 3.0లీ, 3.3లీ, 3.8లీ మరియు 5.0లీ సామర్థ్యాలతో లభిస్తుంది. అన్ని ఇంజన్లు కూడా మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తాయి.

వీటిలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ 5.0లీ జిడిఐ గరిష్టంగా 419 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అన్ని మోడళ్లు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. అన్ని ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ జెనిసిస్‌లోని మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ కారులోని ప్రయాణికులకు పూర్తిస్థాయి సౌకర్యాన్నిస్తుంది. ఇంకా ఇందులో రాడార్ నియంత్రిత అడ్వాన్స్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, కొత్త ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లను కూడా జోడించారు.

2015 హ్యుందాయ్ జెనిసిస్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ప్రీమియం లెథర్‌తో చేయబడిన ఇంటీరియర్స్, విలావంతమైన కార్లలో లభించే అన్ని లగ్జరీ ఫీచర్స్, హ్యుందాయ్ నెక్స్ట్-జెన్ బ్లూ లింక్ టెలిమ్యాటిక్స్ అండ్ ఇన్ఫోటైన్‌మెట్ సిస్టమ్, యాపిల్ సిరి వాయిస్ రికగ్నైజేషన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌తో ఐస్ ఫ్రీ ఆల్సన్, 9.2 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

సేఫ్టీ ఫీచర్ల విషయానికిస్తే, సాధారణంగా అన్ని విలాసవంతమైన కార్లలో లభించే సేఫ్టీ ఫీచర్లకు అదనంగా ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబి), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ విత్ ఇంటిగ్రేటెడ్ హెడ్-అప్ డిస్‌ప్లే వంట సరికొత్త ఫీచర్లను జోడించారు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హ్యుందాయ్ ఈ కారును విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఈ కార్ల ధర శ్రేణి 43,908 డాలర్ల (రూ.27.50 లక్షలు) నుంచి 65,582 డాలర్ల (రూ.40.66 లక్షలు) రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








