కొత్త 2015 సొనాటా సెడాన్‌ను ఆవిష్కరించిన హ్యుందాయ్
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ సొనాటాలో ఓ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ కొరియన్ మార్కెట్ల కోసం విడుదల చేసింది. ఇటీవలే ముగిసిన 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన జెనిసిస్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ కొత్త '2015 హ్యుందాయ్ సొనాటా'ను తయారు చేయనుంది.
గడచిన వారంలో హ్యుందాయ్ 2015 సొనాటా సెడాన్‌కు సంబంధించి ఓ టీజర్ ఫొటోను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ సరికొత్త సొనాటాను పూర్తిగా రివీల్ చేసింది. వచ్చే నెలలో జరగనున్న 2014 న్యూయార్క్ మోటార్ షోలో ఈ కారును తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
ఇండియన్ మార్కెట్‌లో కూడా ఈ కొత్త ప్రీమియం సెడాన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ సరికొత్త హ్యుందాయ్ శాంటాఫేకు సంబంధించిన మరిన్ని ఫొటోలను, వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ఈ సరికొత్త 2015 హ్యుందాయ్ సొనాటాకు సంబంధించిన మరిన్ని ఫొటోలను, వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

కొత్త 2015 హ్యుందాయ్ సొనాటాను ప్రస్తుత సొనాటా కోసం ఉపయోగిస్తున్న అప్‌డేటెట్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇదివరకటి సొనాటా కన్నా ఈ కొత్త సొనాటా 41 శాతం అధిక జడత్వాన్ని మరియు 35 శాతం అధిక నిర్మాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కొత్త సొనా డిజైన్‌లో హ్యుందాయ్ ఫ్లూయిడిక్ స్కల్పచ్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లాంగ్వేజ్‌ను తొలిసారిగా 2015 జెనిసిస్ కారులో ఉపయోగించనున్నారు. హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ ద్వారా ఈ కొత్త డిజైన్‌ను గుర్తించవచ్చు.

కొత్త 2015 హ్యుందాయ్ సొనాటా 4855 మి.మీ. పొడవును, 1865 మి.మీ. వెడల్పును, 1475 మి.మీ. ఎత్తును కలిగి ఉండి 2805 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

ఇదివరకటి సొనాటాతో పోల్చుకుంటే ఈ కొత్త 2015 సొనాటా 35 మి.మీ. పొడవును, 30 మి.మీ. వెడల్పును కలిగి ఉండి, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ కారులో ఏబిఎస్, ఈబిడి, టిసిఎస్, ఈఎస్‌పి, 6 ఎయిర్‌బ్యాగ్స్, బై-జెనాన్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ వంటి స్టాండర్డ్ ఫీచర్లతో పాటుగా.. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేనే డిపాచ్యుర్ వార్నింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, నెక్స్ట్ జెన్ బ్లూ లింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

ఇంజన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొత్త 2015 హ్యుందాయ్ సొనాటాలో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కావచ్చు.

కొత్త 2015 హ్యుందాయ్ సొనాటా రియర్ డిజైన్ ప్రొఫైల్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

మరి ఈ కొత్త 2015 హ్యుందాయ్ ఫ్లూయిడిక్ 2.0 సొనాటా డిజైన్ ప్రస్తుత ఫ్లూయిడిక్ సొనాటా డిజైన్ కన్నా మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా..?


Click it and Unblock the Notifications








