2015 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఆవిష్కరణ: ఫుల్ డిటేల్స్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ సి-క్లాస్ కారును అప్‌గ్రేడ్ చేసింది. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభం కానున్న 2014 డెట్రాయిట్ మోటార్ షోలో కంపెనీ తమ సరికొత్త '2015 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్'ను ప్రదర్శనకు ఉంచనుంది.
ఈ నేపథ్యంలో, తమ కొత్త సి-క్లాస్ కారుకు సంబంధించిన అఫీషియల్ ఫొటోలను, ఆసక్తికర విషయాలను కంపెనీ వెల్లడించింది. పవర్ అవుట్‌పుట్, ఫ్యూయెల్ ఎకానమీ, డిజైన్ వంటి అన్ని విషయాల్లో కొత్త సి-క్లాస్ కారులో మార్పులు చేర్పుల చేశారు. అవేంటో తెలుసుకుందాం రండి..!

కొత్త 2015 సి-క్లాస్ కారు అనేక రకాల ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో కొన్నింటిని ప్రత్యేకించి కొన్ని మార్కెట్ల కోసం తయారు చేశారు. కొత్త సి-క్లాస్ మునుపటి వెర్షన్ కన్నా మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది. ప్రతి వేరియంట్‌లోను స్టార్ట్-స్టాప్ ఫీచర్ స్టాండర్డ్‌గా లభించనుంది. సగటున 20 శాతం మైలేజీని, పెర్ఫామెన్స్‌ను పెంచినట్లు సమాచారం.

కొత్త 2015 సి-క్లాస్ లగ్జరీ కారులో ఉపయోగించనున్న ఇంజన్లలో 2.0 లీటర్ టర్బో ఫోర్, 3.0 లీటర్ టర్బో వి6, 2.1 లీటర్ టర్బో డీజిల్ మరియు 1.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లు ప్రధానమైనది. ఇందులో ఓ హైబ్రిడ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడనున్నాయి. అమెరికాలో విక్రయించనున్న అన్ని వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభ్యం కానుంది.

కొత్త సి-క్లాస్‌ను మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్ లైట్‌వెయిట్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేసుకొని నిర్మించారు. ఇది మునుపటి వెర్షన్ కన్నా పెద్దగా మరియు అదే సమయంలో తేలికగా ఉంటుంది. ప్రస్తుత సి-క్లాస్ కన్నా ఇది సుమారు 100 కేజీల తక్కువ బరువును, 3.7 ఇంచ్‌ల ఎక్కువ పొడవును, 1.6 ఇంచ్‌ల ఎక్కు వెడల్పును, 3 ఇంచ్‌ల ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీని ధృడత్వాన్ని కూడా 20 శాతం పెంచారు.

సి-క్లాస్‌లోనే కాకుండా, ఈ సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా మెర్సిడెస్ ఎయిర్‌మ్యాటిక్ ఎయిర్ సస్పెన్షన్‌ను ఇందులో ఉపయోగించారు. స్టాండర్డ్ వేరియంట్ మాత్రం స్టీల్ సస్పెన్షన్‌తో లభ్యం కానుండగా, వాటిని ఎయిర్-సస్పెన్షన్‌తో అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ సస్పెన్షన్ మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రైడ్‌ను ఆఫర్ చేస్తుంది.

పెర్ఫామెన్స్ కోసం స్పోర్ట్స్ ప్యాకేజ్‌లో భాగంగా, ఓ స్పోర్టీ వెర్షన్ ఎయిర్ సస్పెన్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది రైడ్ హైట్‌ను 0.6 ఇంచ్‌లు తగ్గిస్తుంది. ఈ సస్పెన్షన్లలో కంఫర్ట్, ఈకో, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ అనే విభిన్న సస్పెన్షన్ మోడ్స్ ఉంటాయి. అగిలిటి సెలక్ట్ స్విచ్ ద్వారా ఈ మోడ్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

సేఫ్టీ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా, ఇందులో అనేక ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ఎస్-క్లాస్ లగ్జరీ కారులోని అనేక సేఫ్టీ ఫీచర్లను ఈ కొత్త 2015 సి-క్లాస్‌లోను గమనించవచ్చు.

అటెన్షన్ అసిస్ట్, కొలైషన్ ప్రివెర్షన్ అసిస్ట్ ప్లస్ సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా చెప్పుకోదగినవి. ఈ రెండు ఫీచర్ల వలన అత్యవసర సమయాల్లో ఆటోమేటిక్‌గా బ్రేకులు అప్లయ్ అవుతాయి. ఇంకా ఇందులో డిస్ట్రానిక్ ప్లస్, బిఏఎస్ ప్లస్ బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఎన్‌హాన్స్డ్ యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ట్రాఫిక్ సైన్ అసిస్ట్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కారులో ప్రయాణించే వారి వినోదం, సమాచారం కోసం ఇందులో కమాండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇందులో స్టాండర్డ్‌గా 7 ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ప్యానెల్ ఉంటుంది. కావాలనుకుంటే, దీనిని 8.4 ఇంచ్ డిస్‌ప్లేకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

2014 డెట్రాయిట్ మోటార్ షోలో కొత్త 2015 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఆటోమొబైల్ రంగంలోని అన్ని తాజా అప్‌డేట్ల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈ లోపుగా తర్వాతి స్లైడ్‌లో కొత్త సి-క్లాస్ ఫస్ట్ లుక్ వీడియోని వీక్షించండి.
వీడియో
2015 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఫస్ట్ అఫీషియల్ వీడియో.


Click it and Unblock the Notifications








