భారత్‌కి రానున్న 2014 నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్

By Ravi

భారత్‌లోని స్పోర్ట్స్ కార్ ప్రియులకు గుడ్ న్యూస్. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న పాపులర్ స్పోర్ట్స్ కారు 'నిస్సాన్ జిటి-ఆర్'లో గడచిన సంవత్సరం కంపెనీ ప్రవేశపెట్టిన 2015 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానుంది. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన 20143 టోక్యో మోటార్ షోలో నిస్సాన్ తమ 2015 వెర్షన్ జిటి-ఆర్ స్పోర్ట్ కారును విడుదల చేసిన సంగతి తెలిసినదే.

ఈ పవర్‌ఫుల్ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన వి6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 545 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

భారత్‌‌లో ఇప్పటికే నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుకు పెద్ద ఎత్తున అభిమానాలు ఉన్నారు. మన సెలబ్రిటీలు నారయణ్ కార్తికేయన్ (ఎఫ్1 డ్రైవర్), సచిన్ టెండూల్కర్ (క్రికెట్ ప్లేయర్), నాగార్జున (టాలీవుడ్ హీరో) మొదలైన ప్రముఖుల వద్ద ఇప్పటికే నిస్సాన్ జిటి-ఆర్ కార్లు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

అన్ని రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉండేలా కొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్‌లో సస్పెన్షన్ సిస్టమ్, మెకానికల్ ట్యూనింగ్, యాక్టివ్ ఎలక్ట్రానిక్ ట్యూనింగ్ వంటి మార్పులు చేర్పులు చేశారు. మరింత సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డ్రైవ్‌ను ఆఫర్ చేసేలా కొత్త జిటి-ఆర్‌ను నిస్సాన్ తీర్చిదిద్దింది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

నిస్సాన్ తమ జిటి-ఆర్ కోసం కొత్త డన్‌లాంప్ ఎస్‌పి స్పోర్ట్ మ్యాక్స్ జిటి 600 డిఎస్ఎస్‌టి సిటిటి స్టాండర్డ టైర్లను ఆఫర్ చేస్తోంది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

ఎంతటి స్పీడ్ వద్దనైనా సురక్షితమైన బ్రేకింగ్‌ను అందించేలా నిస్సాన్ జిటి-ఆర్ కారులో బ్రేకింగ్ సిస్టమ్‌ను మెరుగు పరచారు. అలాగే, సిటీలో తక్కువ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి హ్యాండ్లింగ్ ఉండేలా స్టీరింగ్‌ను మెరుగుపరచారు.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

ఇంకా.. ఇందులో అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్‌తో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్స్ ఓ ప్రధాన అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఇది మూడు విభిన్న రకాల ఎల్ఈడి లో బీమ్‌లను (లాంగ్ డిస్టన్స్ ఇల్యుమినేషన్, వైడ్ ఇల్యుమినేషన్‌లతో కలిపి) ఆఫర్ చేస్తుంది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

వెనుక వైపు ఫోర్-రింగ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. మొత్తమ్మీద ఎక్స్టీరియర్‌లో చేసిన మార్పులను గమనిస్తే, ఇది మునుపటి వెర్షన్ కన్నా మెరుగ్గా అనిపిస్తుంది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

ఎక్స్టీరియర్ బాడీ పెయింట్‌లో గోల్డ్ ఫ్లేక్ రెడ్ పెరల్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో అతి సూక్ష్మమైన గోల్డ్ టింటెడ్ గ్లాస్ ఫ్లేక్‌లను రెడ్ పెయింట్‌లో మిక్స్ చేస్తారు. ఇది కారుక మంచి షైనింగ్‌తో కూడిన ఫినిషింగ్‌ను అందిస్తుంది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

వెనుక వైపు కొత్త కార్బన్ ఫైబర్ రియర్ వింగ్‌ను ఆప్షనల్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇది తేలికగా ఉండి, స్పాయిలర్ మాదిరిగా పనిచేస్తుంది.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇది మూడు కొత్త కలర్ స్కీమ్‌లతో లభిస్తుంది. ప్రీమియం లెథర్ అండ్ స్పోర్టీ సీట్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్‌తో పాటు ఇతర ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ కొత్తగా అనిపిస్తాయి.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

అధిక స్పీడ్స్ వద్ద క్యాబిన్‌ లోపల శబ్ధాన్ని తగ్గించేందుకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు.

భారత్‌కు నిస్సాన్ స్పోర్ట్స్ కార్

కొత్త 2015 నిస్సాన్ జిటి-ఆర్ ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడి మార్కెట్లో దీని ధర రూ.1.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2014, 11:38 [IST]
English summary
Japanese carmaker Nissan's iconic sports car GT-R will soon be launched in India. The all-new 2015 Nissan GT-R expected price is around Rs 1.2 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+