న్యూయార్క్ ఆటో షో: 2015 నిస్సాన్ మురానో ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న మురానో క్రాసోవర్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను 2014 న్యూయార్క్ ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించింది. నిస్సాన్ మురానో క్రాసోవర్‌ను తొలిసారిగా 2002లో నిస్సాన్ విడుదల చేసింది.
కాగా.. ఈ కొత్త 2015 మోడల్ నిస్సాన్ మురానో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నిర్వహిచిన నిస్సాన్ జిటి అకాడమీ కార్యక్రమంలో నిస్సాన్ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు.

ప్రస్తుతం నిస్సాన్ ఆవిష్కరించిన ఈ ఫేస్‌లిఫ్ట్ మురానో క్రాసోవర్ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్) చెందినది. ఇదివరకటి నిస్సాన్ మురానోల కన్నా ఈ కొత్త 2015 నిస్సాన్ మురానో మరింత స్పోర్టీగా ఉంటుంది.
నిస్సాన్ గతంలో ఈ కొత్త మురానోను రెసోనాన్స్ అనే కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది. ఆ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త 2015 నిస్సాన్ మురానో క్రాసోవర్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

కొత్త 2015 నిస్సాన్ మురానో క్రాసోవర్‌లో 3.5 లీటర్ వి6 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 260 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








