2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఆవిష్కరణ; త్వరలో విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే భారత మార్కెట్లో రిఫ్రెష్డ్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. పోలో బాటలోనే ప్రస్తుతం కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న పలు మోడళ్లలో కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ తాజాగా 2015 జెట్టా ప్రీమియం సెడాన్‌ను ఆవిష్కరించింది.

ఇది కూడా చదవండి : కొత్త 2014 పోలో విడుదల, ధరలు

ఈ సరికొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్ త్వరలోనే ఇండియాకు కూడా రానుంది. కొత్త జెట్టా ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇది రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా అత్యంత శక్తివంతమైన జిటి ఆప్షన్స్ కూడా ఈ మోడల్‌లో అందుబాటులో ఉండొచ్చని సమాచారం.


కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్‌ను తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన 2014 న్యూయార్క్ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త డిజైన్‌తో కూడిన బంపర్స్, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఇది లభ్యం కానుంది. దీని రియర్ డిజైన్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి.

కొత్త జెట్టా సెడాన్‌లో రియర్ ట్రాఫిక్ అలెర్ట్‌తో కూడిన బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ అనే సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విభిన్న ట్యూనింగ్‌లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్ 125 హెచ్‌పి, 150 హెచ్‌పి ట్యూనింగ్‌లలో లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌తో లభిస్తుంది.

2015 Volkswagen Jetta Rear

డీజిల్ వెర్షన్ 2015 జెట్టా 2.0 లీటర్ టిడిఐ ఇంజన్‌తో 110 హెచ్‌పి, 150 హెచ్‌పి ట్యూనింగ్‌తో లభిస్తుంది. ఇందులో 110 హెచ్‌పి వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌తో లభ్యం కానుంది. ఇకపోతే 150 హెచ్‌పి వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ సరికొత్త 2015 జెట్టా సెడాన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. దేశీయ విపణిలో దీని ధరలు సుమారు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2014, 12:04 [IST]
English summary
Volkswagen India has recently updated its hatchback the Polo and will be soon launching facelifts in its entire range. The German automobile giant had revealed its facelifted Jetta for international markets and have confirmed to get it to India soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+