2017 నాటికి రానున్న అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్ 'వెర్సా'

By Ravi

హిందూజా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్, 2017 నాటికి 'వెర్సా' అనే ఎలక్ట్రిక్ బస్సును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 4వ బస్ అండ్ స్పెషల్ వెహికల్ ఎక్స్‌పోలో అశోక్ లేలాండ్ తమ వెర్సా ఎలక్ట్రిక్ బస్సును ప్రదర్శించింది.

అశోల్ లేలాండ్ వెర్సా ఎలక్ట్రిక్ బస్సులో మొత్తం 36 సీట్లు ఉంటాయి. సింగిల్ చార్జ్‌పై ఈ బస్సు 90 మైళ్ల దూరం ప్రయాణించగలదు. రెగ్యులేషన్స్‌ని బట్టి, వచ్చే రెండేళ్లలో ఈ వాహనాన్ని ఇండియాలో విడుదల చేయవచ్చని భావిస్తున్నామని అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకటరామన్ తెలిపారు.

యూకేకి చెందిన ఆప్టేర్ పిఎల్‌సి కంపెనీ ద్వారా అశోక్ లేలాండ్ ఈ బస్సులను ఇండియాలో విడుదల చేయనుంది. పూర్తిగా యూకేలో తయారైన బస్సులను (సిబియూ రూట్లో) ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ఆప్టేర్ కంపెనీలో అశోక్ లేలాండ్‌కు మెజారీ వాటా ఉంది.

Electric Bus Versa

వెర్సా ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనదని, ఎలాంటి వాయు, శబ్ధ కాలుష్యాలను కలిగించదని, ఈ బస్సు ఒక కిలోమీటరు దూరం ప్రయాణించడానికి 1 యూనిట్ విద్యుత్ మాత్రమే వినియోగించుకుంటుందని వెంటకరామన్ వివరించారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు సుమారు రూ.2-3 కోట్లు ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ లేలాండ్ బ్యాడ్జ్‌తోనే విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ప్రారంభ దశలో భాగంగా ఆప్టేర్‌ సోలో, వెర్సా మెడళ్లను ఇండియాకు తీసుకురానున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులలో కేవలం మోటార్లు, బ్యాటరీలు మాత్రమే ఉంటాయి.

Most Read Articles

English summary
Ashok Leyland plans to launch a fully electric bus 'Versa' in the India by 2017. The bus comes as a completely built unit (CBU) from the company's UK based arm Optare.
Story first published: Monday, January 19, 2015, 9:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X