బజాజ్ క్వాడ్రిసైకిల్‌కి శ్రీలంకలోనూ చుక్కెదురు!

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో అభివృద్ధి చేసిన క్వాడ్రిసైకిల్ 'బజాజ్ ఆర్ఈ60' (Bajaj RE60)కి ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఈ వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడటంపై పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. బజాజ్ ఆర్ఈ60 సురక్షితమైనది కాదని, ఇది మార్కెట్లోకి వస్తే సాంప్రదాయ ఆటోరిక్షా డ్రైవర్ల జీవనోపాధి కోల్పోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బజాజ్ ఆర్ఈ60 లాంటి క్వాడ్రిసైకిళ్లను మార్కెట్లో విడుదల చేయకూడదని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆటో యూనియన్ సంఘాలు కేసులు వేశాయి. దీంతో సదరు రాష్ట్రీయ కోర్టులు కూడా క్వాడ్రిసైకిళ్ల విడుదలపై స్టే విధించాయి. తాజాగా.. బజాజ్ ఆర్ఈ60ని పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా నిషేధించారు. వీటిని తమ దేశంలో అనుమతించకూడదని శ్రీలంకన్ మోటార్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

bajaj re60 quadricycle

వాస్తవానికి బజాజ్ ఆటో తమ ఆర్ఈ60 క్వాడ్రిసైకిల్‌ను ఇండియా కన్నా ముందుగా శ్రీలంకలో విడుదల చేయాలని భావించింది. శ్రీలంకలో బజాజ్ అందిస్తున్న ఆటోరిక్షాలకు మంచి గిరాకీ ఉంది, కానీ ఈ క్వాడ్రిసైకిల్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా మారింది.

భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని బజాజ్ ఆర్ఈ60 విడుదలను శ్రీలంకన్ అథారిటీ వ్యతిరేకించింది. ఇది (ఆర్ఈ60) త్రీవీలర్ కన్నా వరస్ట్ అని శ్రీలంకన్ అథారిటీ అభిప్రాయపడింది. వాస్తవానికి బజాజ్ ప్రస్తుత సాంప్రదాయ ఆటోరిక్షాల కన్నా మెరుగైన, సౌకర్యవంతమైన రవాణాను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ క్వాడ్రిసైకిళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పోసింది. అయితే, ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి.

బజాజ్ ఆర్ఈ60 విషయానికి వస్తే.. ఇందులో 200సీసీ డిటిఎస్-ఐ టెక్నాలజీతో కూడిన ఇంజన్‌ను అమర్చారు. టాటా నానో మాదిరిగానే బజాజ్ ఆర్ఈ60 ఇంజన్ కూడా వెనకభాగంలోనే ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు తీస్తుంది. బజాజ్ ఆర్ఈ60 లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ గతంలో పేర్కొంది.

Most Read Articles

English summary
Bajaj, one of India's leading two-wheeler and three-wheeler manufacturer seems to be surrounded by a bit of bad luck this year. The Pune based auto maker firstly saw a drop in sales last month, and is now been banned by the Sri Lankan Motor Department from launching its latest quadricycle, the RE60.
Story first published: Wednesday, March 4, 2015, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X