హుర్రే.. ఫెరారీ కార్లు మళ్లీ ఇండియాకు వచ్చేశాయోచ్..!

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ, భారత మార్కెట్లో పునఃప్రవేశించింది. దేశంలో రెండు కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించడం ద్వారా ఫెరారీ భారత విపణిలో తిరిగి కాలు మోపింది. వాస్తవానికి ఫెరారీ 2011లోనే శ్రేయాన్స్ గ్రూపు ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. అయితే, ఈ గ్రూప్‌పై వినియోగదారుల ఫిర్యాదులు అధికం కావటంతో కంపెనీ తమ డీల్‌ను రద్దు చేసుకుంది.

తాజాగా ఫెరారీ ఢిల్లీ, ముంబై నగరాల్లో రెండు కొత్త డీలర్లను నియమించుకుంది. ఈ నగరాల్లో ఇప్పటికే ఫెరారీ తమ కస్టమర్ బేస్‌ను స్థిరపరుచుకుంది. ఫెరారీ తమ కార్లను పూర్తిగా విదేశాల నుంచి (సిబియూ రూట్లో) దిగుమతి చేసుకొని ఇండియన్ మార్కెట్లో విక్రయించనుంది.

పాపులర్ ఫెరారీ కాలిఫోర్నియా, 458 ఇటాలియా, 599జిటిబి ఫియోరానో వంటి మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.2.2 కోట్ల నుంచి రూ.3.4 కోట్ల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Ferrari Extends Its Official Presence In India

భారతదేశంలో ఫెరారీ డీలర్‌షిప్ చిరునామా వివరాలు ఇలా ఉన్నాయి:
  • ఫెరారీ ఢిల్లీ షోరూమ్:

Select Cars Pvt. Ltd
A 19, Mohan Cooperative Industrial Estate,
Mathura Road, New Delhi

  • ఫెరారీ ముంబై షోరూమ్:

Navnit Motors Pvt. Ltd.
C Wing, Waterford Bldg,
C D Barfiwala Road (Juhu Galli),
Andheri (W), Mumbai 400058

Most Read Articles

English summary
Ferrari has announced the appointment of two new dealers in the country to extend its official presence in India, a strategic market for the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X