మిత్సుబిషి అట్రాజ్, డెలికా ఇండియాకి వస్తున్నాయ్..!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి, 2016 నాటికి భారత మార్కెట్లో మొత్తం 5 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగా.. మిత్సుబిషి ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో తమ అట్రాజ్ సెడాన్‌ను భారత విపణిలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

మిత్సుబిషి అట్రాజ్ సెడాన్‌తో పాటుగా కంపెనీ తమ డెలికా ఎమ్‌పివిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మోడళ్లను విడుదల చేయటం ద్వారా మాస్ మార్కెట్లో మంచి పట్టును సాధించగమలని మిత్సుబిషి ఇండియా ధీమాగా ఉంది. వీటితో పాటుగా ఓ హ్యాచ్‌బ్యాక్ (బహుశా మిరాజ్), నెక్స్ట్ జనరేషన్ అవుట్‌లాండర్, మోంటెరో మోడళ్లను కూడా ఇండియాలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Mitsubishi Attrage

మిత్సుబిషి ప్రస్తుతం భారత్‌లోని హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి ఇక్కడి మార్కెట్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ ఏడాదితో ఒప్పందం ముగియనుంది. ఇది ముగిసిన తర్వాత, మిత్సుబిషి ఇండియన్ మార్కెట్ కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోనుంది. ఇందులో భాగంగానే, ఇక్కడి మార్కెట్లో పట్టు సాధించేందుకు తమ ప్రోడక్ట్ పోర్ట్‌‌ఫోలియోని విస్తరించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
Mitsubishi Delica

ఇకపోతే.. ఎమ్‌పివి సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న మోడళ్లకు పోటీగా మిత్సుబిష్ తమ గ్లోబల్ వెర్షన్ డెలికా ఎమ్‌పివిని ఇండియాకు తీసుకురానుంది. ఈ మోడల్‌ను స్థానికంగా అసెంబ్లింగ్ చేయటం ద్వారా దేశీయ మార్కెట్లో లభిస్తున్న ఇతర ఎమ్‌పివిలకు పోటీగా దీని ధరను అందుబాటులో ఉంచాలని మిత్సుబిషి ఇండియా భావిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Mitsubishi had plans of launching five vehicles in India between 2014 to 2016. Among these was their small car called the Mirage hatchback. They have decided not to launch this vehicle as there is intense competition in this segment.
Story first published: Friday, February 13, 2015, 17:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X