90 శాతం మందికి పైగా ఇండియన్స్ సేఫ్టీ ఫీచర్స్ కోరుకుంటున్నారు!

By Ravi

ప్రస్తుతం భారతదేశంలో కార్ల భద్రత విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై జరిపిన అధ్యయనాలు కూడా సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నాయి. భారతీయ వినియోగదారులు కారు ధర కంటే కూడా అందులో ఉండాల్సిన సేఫ్టీ ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

చిన్న కార్లను కొనుగోలుచేసే భారతీయ వినియోగదారులలో దాదాపు 90 శాతం మందికి పైగా కారలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు కోరుకుంటున్నారని ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్ అధ్యయనంలో వెల్లడైంది.

Indian Small Car Buyers Demand Saftey Features

దురదృష్టకరమైన అంశం ఏంటంటే.. ఇంత మంది తమ చిన్న కార్లలో సేఫ్టీ ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం దాదాపు 34 మంది ఉపయోగిస్తున్న చిన్న కార్లలో మాత్రమే ఇలాంటి ఫీచర్లు ఉన్నట్లు జెడి పవర్ స్టడీలో తేలింది.

ఇండియన్ స్మాల్ కార్ కస్టమర్స్ కోరుకునే ఫీచర్లలో ఎక్కువగా.. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎయిర్‌బ్యాగ్స్, హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, పార్కింగ్ అసిస్ట్/సెన్సార్స్, హ్యాండ్స్-ఫ్రీ కమ్యూనికేషన్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రియర్ విండో వైపర్ వంటి ఫీచర్లు ఉన్నట్లు జెడి పవర్ తెలిపింది.

Most Read Articles

English summary
JD Power recent study reveals that, over 90% of the Indian small car buyers demand safety features such as Anti-lock braking system (ABS ) and airbags.
Story first published: Friday, January 16, 2015, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X