టొయోటా హైఏస్ ఎమ్‌పివి గురించి 10 ఆసక్తికర అంశాలు

By Ravi

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా, ఈ ఏడాది ఆరంభంలో న్యూఢిల్లీలో జరిగిన నాల్గవ ఎడిషన్ 'బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో 2015'లో తమ సరికొత్త కమ్యూటర్ వాహనం 'టొయోటా హైఏస్' (Toyota HiAce)ను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే.

సౌత్ ఈస్ట్ ఏషియాలో అత్యంత పాపులర్ అయిన ఈ ఎమ్‌పివి, ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో హైఏఎస్ 10-సీటర్ లగ్జరీ కమ్యూటర్ వాహనానికి సంబంధించిన 10 ఆసక్తికర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

1. ధర

1. ధర

టొయోటా హైఏస్‌ను సిబియూ రూట్లో పూర్తిగా జపాన్ నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఫలితంగా భారత మార్కెట్లో దీని ధర రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్యలో ఉండొచ్చని సమాచారం.

2. లగ్జరీ కమ్యూటర్

2. లగ్జరీ కమ్యూటర్

ఇప్పటి వరకూ మినీ బస్, టెంపో ట్రావెలర్ వంటి సాధారణ ప్యాసింజర్ కమ్యూటర్ వాహనాలను చూసిన, భారతీయులు ఇకపై అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్లతో రూపొందించిన హైఏస్‌ను చూడొచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా దీని ఇంటీరియర్స్ డిజైన్ చేశారు.

3. లోకల్ అసెంబ్లీ

3. లోకల్ అసెంబ్లీ

టొయోటా హైఏస్‌కు భారత్‌లో మంచి గిరాకీ ఏర్పడినట్లయితే, ఈ మోడల్‌ను స్థానికంగానే అసెంబ్లింగ్ చేసి, తక్కువ ధరకే విక్రయించాలని టొయోటా భావిస్తోంది. ఇందుకు మరో రెండు మూడేళ్ల సమయం పట్టే ఆస్కారం ఉంది.

4. టార్గెట్ కస్టమర్స్

4. టార్గెట్ కస్టమర్స్

టొయోటా ఫ్యామిలీ ఎమ్‌పివిని కోరుకునే కస్టమర్లను కాకుండా, అధిక డబ్బు చెల్లించగలిగే సామర్థ్యం ఉన్న ప్రయాణీకుల కోసం వాహనాలను నిర్వహించే టూర్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకొని, టొయోటా తమ హైఏస్‌ను ఇండియాలో ప్రవేశపెట్టనుంది.

5. యల్లో బోర్డ్

5. యల్లో బోర్డ్

ఈ 10-సీటర్ లగ్జరీ కమ్యూటర్ వెహికల్ యల్లో బోర్డును కలిగి ఉండనుంది. అంతేకాకుండా ఈ మోడల్‌ను వ్యక్తిగత ప్రయోజనం కోసం కూడా ఉపయోగించుకునేందుకు అనుమతించాలని టొయోటా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

6. డి-4డి 3.0 లీటర్ ఇంజన్

6. డి-4డి 3.0 లీటర్ ఇంజన్

టొయోటా హైఏస్ 10-సీటర్ కమ్యూటర్ వాహనంలో కంపెనీ అత్యంత పాపులర్ అయిన 3.0 లీటర్ డి-4డి టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3400 ఆర్‌పిఎమ్ వద్ద 136 పిఎస్‌ల శక్తిని, 1200-2400 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

7. కొలతలు

7. కొలతలు

టొయోటా హైఏస్ 5380 మి.మీ. పొడవును, 1880 మి.మీ. వెడల్పును, 2285 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌‌బేస్ 3110 మి.మీ.

8. ఇంటీరియర్ ఫీచర్స్

8. ఇంటీరియర్ ఫీచర్స్

  • వెనుక ప్యాసింజర్లకు సైతం ఎయిర్ కండిషనింగ్ వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్
  • ప్రతి సీటుకు రిక్లైన్ సౌకర్యం
  • వెనుక భాగంలో లగేజ్ కోసం కార్గో స్పేస్
  • 9. కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్స్

    9. కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్స్

    • ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
    • ఈజీ క్లోజర్ అండ్ పవర్ స్లైడ్ డోర్
    • రియర్ వ్యూ కెమెరా
    • ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్‌పై రివర్సింగ్ కెమెరా డిస్‌ప్లే
    • 10. సేఫ్టీ ఫీచర్స్

      10. సేఫ్టీ ఫీచర్స్

      • డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
      • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
      • ఇంజన్ ఇమ్మొబిలైజర్

Most Read Articles

English summary
We are compiled 10 interesting facts of Toyota HiAce. Take a look.
Story first published: Thursday, March 26, 2015, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X