జేమ్స్ బాండ్ లేటెస్ట్ మూవీలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు

By Ravi

జేమ్స్ బాండ్ చిత్రాలలో ఉపయోగించే కార్లకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. తరతరాలుగా వస్తున్న పలు జేమ్స్ బాండ్ చిత్రాలలో ఇప్పటికే అనేక రకాల కార్లను ఉపయోగించారు. సదరు కార్లన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయాయి. అయితే, బాండ్ సినిమాలలో ఉపయోగించిన కార్లలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నవి మాత్రం ఆస్టన్ మార్టిన్ కార్లే అని చెప్పాలి.

కాగా.. తాజాగా వస్తున్న 'స్పెక్టేర్' చిత్రంలో కూడా జేమ్స్ బాండ్ పాత్రధారి సరికొత్త ఆస్టన్ మార్టిన్ డిబి10 కారును ఉపయోగించనున్నారు. అయితే, దీనికి ముందు వచ్చిన 'స్కైఫాల్' చిత్రంలో ఎక్కువగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఉపయోగించారు. ఈ నేపథ్యంలో, ఈ కొత్త బాండ్ సినిమాలో కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు సందడి చేయనున్నాయి.

స్పెక్టర్ చిత్రంలో విలన్ పాత్ర పోషించనున్న వ్యక్తి జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్‌‌కారును ఉపయోగించనున్నారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో జాగ్వార్ కార్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గత 2006లో వచ్చిన క్యాసినో రాయల్ చిత్రంలో జాగ్వార్ ఎక్స్‌జే8, ఎక్స్‌జేఆర్ అలాగే, 2002లో వచ్చిన డై అనదర్ డే చిత్రంలో జాగ్వార్ ఎక్స్‌కేఆర్ కారును ఆస్టన్ మార్టిన్ వాంక్విష్‌కి పోటీగా ఉపయోగించారు.

James Bond Spectre JLR Cars

జేమ్స్ బాండ్ కొత్త చిత్రం ‘స్పెక్టర్'లో మూడు జేఎల్‌ఆర్ వాహనాలు కనువిందు చేస్తాయని, బాండ్ 007 (డేనియల్ క్రెయిగ్)తో చేజింగ్ సీన్‌లో చిత్రంలోని విలన్ జాగ్వార్ సి-ఎక్స్75 కారును ఉపయోగిస్తారని జేఎల్ఆర్ స్వాధీన చేసుకున్న భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తెలిపింది. ఈ చిత్రం కోసం భారీగా మోడిఫై చేసిన లాండ్‌రోవర్ డిఫెండర్, రేంజ్‌రోవర్ స్పోర్ట్ మోడళ్లను ఉపయోగించనున్నారు.

ఈ ఎస్‌యూవీలతో ఆస్ట్రియాలో ఇప్పటికే కొన్ని సీన్‌లను చిత్రీకరించినట్లు జేఎల్‌ఆర్ స్పెషల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ ఎడ్వర్డ్స్ తెలిపారు. కాగా.. 2012లో వచ్చిన ‘స్కైఫాల్' చిత్రంలో కూడా ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 డబుల్ క్యాబ్ పికప్‌ను ఉపయోగించారు. శామ్ మెండెస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న స్పెక్టర్ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
British Luxury carmaker Jaguar and Land Rover have announced a partnership with James Bond Spectre, the latest and the 24th James Bond movie. In the latest 007 adventure, cars like the Jaguar C-X75s, Range Rover Sport SVRs and Defender Big Foots will be featured, provided by Jaguar Land Rover Special Operations.
Story first published: Thursday, February 12, 2015, 14:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more