మినీ ట్రక్కును మరియు ఎనిమిది సీట్ల మినీ వ్యాన్‌లను పరిచయం చేసిన మహీంద్రా.

By Anil

దేశంలోని ప్రముఖ వాహన తయారీదారులైన మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ రెండు కొత్త వాహనాలను విడుదల చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి ఆమ్ని వ్యాన్‌ను కుటుంబ సమేత ప్రయాణాలకు ఉపయోగించే వారు అయితే దీనికి పోటిగా ఇప్పుడు మహీంద్ర సుప్రొ వ్యాను పరిచయం చేసింది. అంతే కాకుండా వాణిజ్య వాహనమైన టాటా ఏస్ మెగా వాహనానికి పోటిగా మహీంద్రా సుప్రొ మ్యాక్సి ట్రక్కును మార్కెట్లోకి విడుదల చేసింది.

మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్ ఆవిష్కరణ
మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన రెండు మోడళ్లు ఇవే.

  • మహీంద్ర సుప్రొ వ్యాన్
  • మహీంద్ర సుప్రొ ట్రక్

మహీంద్ర విడుదల చేసిన ఈ రెండు మోడల్స్ గురించి సమగ్ర సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం..

 వ్యాన్ ధరలు :

వ్యాన్ ధరలు :

మహీంద్రా అండ్ మహీంద్రా సుప్రొ వ్యాన్

  • యల్.ఎక్స్ ధర రూ. 4.38 లక్షలు
  • వి.ఎక్స్ ధర రూ. 4.63 లక్షలు
  • జడ్.ఎక్స్ ధర రూ. 4.93 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, థానే)

    ట్రక్కు ధరలు :

    ట్రక్కు ధరలు :

    మహీంద్రా అండ్ మహీంద్రా సుప్రొ మ్యాక్సి ట్రక్కు

    • సుప్రొ మ్యాక్సి ట్రక్ టి-2 ధర రూ. 4.25 లక్షలు
    • సుప్రొ మ్యాక్సి ట్రక్ టి-4 ధర రూ. 4.45 లక్షలు
    • సుప్రొ మ్యాక్సి ట్రక్ టి-6 ధర రూ. 4.75 లక్షలు
    • (అన్నిధరలు ఎక్స్ షోరూమ్,థానే)

      సీటింగ్ కెపాసిటి :

      సీటింగ్ కెపాసిటి :

      మహీంద్ర యొక్క ప్యాసింజర్ వాహనంలో సౌకర్యవంతంగా ఎనిమిది మంది (2+3+3) ప్రయాణించవచ్చు. మరొక వాణిజ్య వాహనమైన మహీంద్రా మ్యాక్స్ సుప్రొ ట్రక్ యొక్క కెపాసిటి ఒక టన్నుగా ఉంది.

      మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో వస్తున్న 7 సీటర్ వ్యాగన్‌ఆర్

      పోటి :

      పోటి :

      ప్రస్తుతం మహీంద్రా సుప్రొ వ్యాన్ మరియు సుప్రొ ట్రక్ రెండు కూడా దేశ వ్యాప్తంగా ఉన్న మారుతి, టాటా ఉత్పతులైన ఆమ్ని మరియు ఏస్ మెగా మోడళ్ళకు గట్టి పోటిగా విడుదల చేసింది.

      ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

      ఇంజన్ స్పెసిఫికేషన్స్ :

      మహీంద్రా యొక్క సుప్రొ వాహనాలలో గల ఇంజన్ 909 సీసీ, డైరక్ట్ ఇంజెక్షన్ టుర్బో డీజల్ మోటార్ ఇంజన్ ఇది 45 హార్స్‌పవర్, 98ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

      మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం: టి.వి.యస్ జూపిటర్ స్కూటర్ ప్రచారకర్తగా అమితాబచ్చన్

       మైలేజ్ :

      మైలేజ్ :

      మహీంద్రా వ్యాన్ లీటర్‌కు 23.5 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగా, మహంద్రా మ్యాక్సి ట్రక్ లీటర్‌కు 22.4 కిలోమీటర్ మైలేజ్‌ను ఇస్తుంది. మరియు ఈ రెండు వాహనాలు కూడా 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ‌ను కలిగి ఉన్నాయి.

      ఫీచర్స్ :

      ఫీచర్స్ :

      ఈ రెండు సుప్రొ వాహనాలలో గల ప్రాథమిక వేరియంట్లలో ఎయిర్ కండీషనర్ మరియు పవర్ స్టీరింగ్‌ను ఇవ్వలేదు. అయితే ఇదే సుప్రొ వాహనాలలో ఉన్న టాప్ వేరియంట్లలో ఈ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి.

      సుప్రొ వ్యాన్ :

      సుప్రొ వ్యాన్ :

      మహీంద్రా అండ్ మహీంద్రా సుప్రొ వ్యానులో మొబైల్ ఛార్జింగ్ మరియు అత్యధిక బూట్ స్పేస్ కలదు. ఐదు మరియు ఎనిమిది సీటింగ్ కెపాసిటి ఉండేట్లు ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

Most Read Articles

English summary
Mahindra launches the Supro Van and Supro Maxi Truck in India for a starting price of INR 4.38 lakh and 4.25 lakh respectively. The Supro Van is a passenger vehicle that can carry 8 passengers, while the Supro Maxi Truck is a commercial vehicle that can carry 1000 kg of payload.
Story first published: Friday, October 16, 2015, 17:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X