మారుతి సుజుకి ఈకో ఫేస్‌లిఫ్ట్ వస్తోంది!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ 'ఈకో' (Eeco)లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రిఫ్రెష్డ్ ఈకో విషయానికి వస్తే.. డిజైన్ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. బెటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను కూడా మెరుగు పరచనున్నారు. టాప్-ఎండ్ వేరియంట్లో ఎయిర్ కండిషనింగ్‌ను కూడా ఆఫర్ చేయవచ్చు. అలాగే, సేఫ్టీ ఫీచర్ల పరంగా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది.

maruti eeco facelift

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి ఈకో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో బిఎస్-4 వెర్షన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 73 బిహెచ్‌పిల శక్తిని, 101 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మారుతి ఈకో ప్రస్తుతం 5 వేరియంట్లలో లభిస్తోంది. విపణిలో వీటి ధరలు రూ.3.37 లక్షల నుంచి రూ.4.44 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి ఈకో వాహనాన్ని వ్యక్తిగత మరియు వాణిజ్య ప్రయోజనం కోసం వినియోగిస్తుంటారు.

Most Read Articles

English summary
In 2014 Maruti Suzuki launched two new products the Celerio and Ciaz both catering to different buyers. They also provided facelifts and refreshes to a couple of their vehicles. Now the Japanese manufacturer has decided to give its Eeco vehicle a much needed facelift.
Story first published: Saturday, January 31, 2015, 10:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X