మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా.. మెరూ ఈవ్ క్యాబ్స్

By Ravi

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు భద్రత కరువవుతోంది. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఎన్ని వచ్చినా, అబలలపై ఆకతాయిల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల జరిగిన ఊబేర్ రేప్ సంఘటన నేపథ్యంలో, క్యాబ్‌లను ఆశ్రయించాలంటనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ రేడియో క్యాబ్ సేవల సంస్థ మెరు మహిళల కోసం సరికొత్త క్యాబ్ సేవలు ప్రారంభించింది.

మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా ఉండేలా మెరూ ఈవ్ క్యాబ్ పేరిట కొత్త టాక్సీ సేవలను కంపెనీ పరిచయం చేసింది. మెరూ ఈవ్ క్యాబ్స్‌ను నిపుణులైన మహిళా డ్రైవర్లే నడుపుతారు, ఈ మహిళా డ్రైవర్లకి ఢిల్లీ పోలుసులు స్వీయ రక్షణ శిక్షణ (సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్)ను కూడా కల్పిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో వారికి తెలియజేస్తారు. కౌన్సిలర్లు వారికి మనోధైర్యాన్ని కలిగిస్తారు.

Meru Launches Eve Cabs For Women By Women

ప్రస్తుతానికి మెరూ ఈవ్ క్యాబ్స్ సేవలను ఢిల్లీలో మాత్రమే పరిచయం చేశారు. ఈ సేవలు విజయవంతమైతే, దేశంలోని ఇతర నగరాలకు కూడా వీటిని విస్తరిస్తారు. ఢిల్లీలో ప్రస్తుతం 20 మంది మహిళా డ్రైవర్లు మెరూ ఈవ్ క్యాబ్స్‌ను ఆపరేట్ చేస్తున్నారు. మహిళలు మెరూ ఈవ్ క్యాబ్స్‌ని సులభంగా గుర్తించేందుకు వీలుగా వీటిని బ్రైట్ పింక్ అండ్ వైట్ కలర్‌లో పెయింట్ చేస్తారు.

మెరూ ఈవ్ క్యాబ్స్‌లో స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్పేర్ అలాగే బయటి వారిని అప్రమత్తం చేయటం పానిక్ బటన్‌ను అందుబాటులో ఉంచుతారు. కారులో ఏదైనా అనివార్య సంఘటన చోటుచేసుకుంటే, సాక్ష్యం కోసం ఇందులో వీడియో కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్లు అధికారులకు కాల్ చేసేందుకు స్పీడ్ డయల్‌తో కూడిన 3జి ఫోన్స్‌ను అందుబాటులో ఉంచుతారు.

మెరూ ఈవ్ క్యాబ్స్ కోసం అధిక చార్జీలు ఏమీ వసూలు చేయరు. మహిళా కస్టమర్లు కాల్ సెంటర్‌కు కాల్ చేసి కానీ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా కానీ ఈవ్ క్యాబ్స్‌ని బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

Story first published: Thursday, January 22, 2015, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X