ఢిల్లీ ఎన్నికలు ముగిసాయి.. పెట్రోల్ ధరలు పెరిగాయి..

ఢిల్లీలో ఎన్నికలు ముగియటంతో పెట్రోల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఈ నెల ఆరంభంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.42 తగ్గింపును మరియు లీటరు డీజిల్‌పై రూ.2.25 తగ్గింపును ప్రకటించిన చమురు కంపెనీలు తాజాగా వీటి ధరలను పెంచాయి.

అంతర్జాతీయ మార్కెట్లలోని చమురు ధరలో స్వల్ప మార్పు కారణంగా, దేశీయ మార్కెట్లో లీటరు పెట్రోల్‌పై 82 పైసలు మరియు లీటరు డీజిల్‌పై 62 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి.

పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. గడచిన ఆగస్టు 2014 నెల నుంచి చూసుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఇదే మొదటిసారి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.63.92 నుంచి రూ.64.74 లకు పెరగగా, లీటర్ డీజిల్ ధర రూ.52.13 నుంచి రూ.52.84 లకు పెరిగింది.

Petrol Price Hike
Most Read Articles

English summary
Petrol price was on Sunday hiked by 82 paise per litre and diesel by 61 paise, reversing the declining trend of last six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X