స్లింగ్‌షాట్‌ను నడపటం ఆపేయమన్న పోలారిస్, కారణమేంటి?

By Ravi

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆల్ టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్, గడచిన సంవత్సరం జులై నెలలో రోడ్ యూజ్ కోసం ఉద్దేశించి తయారు చేసిన స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ వాహనాన్ని గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఇందులో రెండు సమస్యలను గుర్తించామని, అందుకే వీటిని వెనక్కు పిలిపిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ఇందులో మొదటి సమస్య స్టీరింగ్‌కి సంబంధించినది. లోపపూరితమైన స్టీరింగ్ ర్యాక్ మరియు బాల్ బేరింగ్స్ కారణంగా స్టీరింగ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందని, ఫలితంగా డ్రైవర్ స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఉందని కంపెనీ వివరించింది. ఇకపోతే రెండవ సమస్య రోల్ బార్స్‌కి సంబంధించినది. ఈ రోల్ బార్‌ను డ్రైవర్, ప్యాసింజర్ సీట్ల క్రింది భాగంలో అమర్చబడి ఉంటుంది.

Polaris Slingshot Recall

పోలారిస్ ఇప్పటి వరకూ ఎన్ని యూనిట్ల స్లింగ్‌షాట్ వాహనాలను విక్రయించినది, ఈ రీకాల్‌కు ఎన్ని యూనిట్లు వర్తిస్తాయి అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. కాగా.. తమ వద్దకు వచ్చే వాహనాలను ఉచితంగా తనిఖీ చేసి, ఈ లోపాన్ని సరిచేస్తామని ప్రకటించింది. పోలారిస్ స్లింగ్‌షాట్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇండియాలో లభ్యం కావట్లేదు.

పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ మూడు చక్రాలు, రెండు సీట్లు కలిగిన వాహనం (మూడు చక్రాలు కలిగిన వాహనాన్ని ట్రైక్ అని పిలుస్తారు). స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ రెండు వేరియంట్ల (బేస్, ఎస్ఎల్)లో లభిస్తుంది. ఇదొక స్ట్రీట్ లీగల్ వాహనం. అంటే దీనిని సాధారణ రోడ్లపై కూడా నడుపుకోవచ్చన్నమాట.

Polaris Slingshot

పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్‌లో జనరల్ మోటార్స్ నుంచి గ్రహించిన 2.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 173 హార్స్ పవర్‌ల శక్తిని, 225 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను స్లింగ్‌షాట్ ట్రైక్ ముందు భాగంలో అమర్చారు. ఈ ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక ఉన్న చక్రానికి బదిలీ అవుతుంది.

ఇది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ 36 మి.మీ. ఫైనల్ డ్రైవ్ బెల్టును కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. స్లింగ్‌షాట్ మొత్తం బరువు 782 కేజీలు మాత్రమే. మనదేశం కరెన్సీ ప్రకారం చూసుకుంటే, పోలారిస్ స్లింగ్‌షాట్ రోడ్‌స్టర్ ధరలు, రూ.12.02 లక్షలు (బేస్ వేరియంట్), రూ.14.43 లక్షలు (ఎస్ఎల్ వేరియంట్)గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Polaris Industries has issued a cautionary statement and is asking owners of Slingshot to not drive their vehicles. The American manufacturer has found two issues with their three-wheeler. Both issues can cause serious damage to the vehicle as well as the occupants.
Story first published: Tuesday, January 20, 2015, 19:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X