జేఎల్ఆర్ పూనే ప్లాంట్‌లో రేంజ్ రోవర్ ఎవోక్ అసెంబ్లింగ్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ ఎస్‌యూవీని స్థానికంగా భారత్‌లో అసెంబ్లింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

స్థానికంగా అసెంబుల్ అయిన రేంజ్ రోవర్ ఎవోక్‌ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నారు. పూనేలో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్‌లో ఈ మోడల్‌ను అసెంబుల్ చేస్తారు. ఈ ప్లాంట్‌లో జేఎల్ఆర్ నుంచి ఉత్పత్తి కానున్న నాల్గవ మోడల్ ఇది.

Range Rover Evoque

వచ్చే నెల ఆరంభం నుంచే ఈ లోకల్ మేడ్ రేంజ్ రోవర్ ఎవోక్ డెలివరీలు ప్రారంభం కావచ్చని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.48.73 లక్షల నుంచి రూ.56.21 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ముంబై) ఉండొచ్చని అంచనా.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రస్తుతం తమ పూనే ప్లాంట్‌లో ఫ్రీల్యాండర్ 2, జాగ్వార్ ఎక్స్ఎఫ్, జాగ్వార్ ఎక్స్‌జే మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తుంది. రేంజ్ రోవర్ ఎవోక్ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది వాటి ధరలు వరుసగా రూ.48.73 లక్షలు (బేస్ వేరియంట్), రూ.52.40 లక్షలు (మిడ్ వేరియంట్), రూ.56.21 లక్షలు (టాప్ వేరియంట్)గా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై) ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata Motors-owned Jaguar Land Rover will start assembling popular sports utility vehicle Range Rover Evoque at its Pune manufacturing facility to make it the fourth model to be rolled out locally.
Story first published: Friday, March 27, 2015, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X