రెనో డస్టర్ 4x4 అడ్వెంచర్ ఎడిషన్ ధరలో కోత.. పరిమితం కాలం మాత్రమే..

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన రెనో డస్టర్ 4x4 అడ్వెంచర్ ఎడిషన్ ధరలో కోతను విధించింది. ఈ వేరియంట్‌పై కంపెనీ ఏకంగా రూ.1.5 లక్షల డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఇదివరకు రూ.12.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యం అవుతున్న రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ఇప్పుడు కేవలం రూ.10.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యమవుతోంది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 28, 2015 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత రెనో డీలరును సంప్రదించండి.

renault duster awd price slash

రెనో తమ 4x4 మోడల్‌పై మరిన్ని స్కీమ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్ కొనుగోలుపై కస్టమర్లు రూ.15,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వేరియంట్‌పై ఉచిత బీమాను కూడా కంపెనీ అందిస్తోంది. అయితే, ఇది కేవలం 2014 మోడల్ అడ్వెంచర్ ఎడిషన్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌‌లో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3900 ఆర్‌పిఎమ్ వద్ద 110 పిఎస్‌ల శక్తిని, 2250 ఆర్‌పిఎమ్ వద్ద 248 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో యూఎస్‌బి పోర్ట్, 4 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్, మీడియాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ మోడల్‌లో 85 పిఎస్ పవర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Previously Renault India was charging customers INR 12,49,000 ex-showroom, Delhi for its Duster 4x4 Adventure edition. Now the French manufacturer has slashed the price down to INR 10,99,000 ex-showroom, Delhi for this same variant. The offer is only valid for a few more days and will end on 28th of February, 2015.
Story first published: Thursday, February 26, 2015, 13:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X