రెనో ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మో ఆవిష్కరణ

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, వీడియో గేమ్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన ఫుల్-స్కేల్ మోడల్ 'ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మో' మోడల్‌ను ఆవిష్కరించింది. ప్యారిస్‌లో జరిగిన ఫెస్టివల్ ఆటోమొబైల్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ఈ స్టన్నింగ్ కారును ప్రదర్శించారు.

ఈ రేసర్‌ను ప్యారిస్‌లోని పోర్ట్ డె వెర్సైల్లెస్‌లో ఫిబ్రవరి 4 నుంచి 8వ తేది వరకు జరగనున్న 2015 రెట్రోమొబైల్ షోలో కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆల్పైన్ 60వ వార్షికోత్సవ కానుకగా, అలాగే గ్రాన్ తురిస్మో 6 అభిమానుల కోసం ఈ కారును తయారు చేశారు.

renault concept car

లీమ్యాన్స్ 24 అవర్స్‌లో ఆల్పైన్ ఏ450 కారు నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మో మోడల్‌ను డిజైన్ చేశారు. 21 శతాబ్ధపు ఆల్పైన్‌ను అభివృద్ధి చేస్తున్న ఇంజనీర్లు, డిజైనర్ల ఊహలకు ప్రతిఫలమే ఈ ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మో అని రెనో పేర్కొంది.

రెనో ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మో కారులో 4.5 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ కారు మధ్య భాగంలో ఉంటుంది. ఇది గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 450 హెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 580 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. దీని మొత్తం బరువు 900 కేజీలు. మార్చ్‌లో ప్లేస్టేషన్ 3 కోసం గ్రాన్ తురిస్మో 6లో ఆల్పైన్ విజన్ గ్రాన్ తురిస్మోను ఫ్రీ అప్‌డేట్‌గా ఇవ్వనున్నారు.

Most Read Articles

English summary
French carmaker Renault has revealed a full-scale model of the Alpine Vision Gran Turismo game racer, in the Festival Automobile International in Paris on the 27th of January.
Story first published: Friday, January 30, 2015, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X