అమ్మకానికి మిస్టర్ బీన్ మెక్‌లారెన్ కారు; ధరెంతో తెలుసా?

By Ravi

మిస్టర్ బీన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం హావభావాలతో, అమాయకత్వంతో హస్యాన్ని పలికించి వీక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించే హాలీవుడ్ హాస్యనడుడు 'రోవన్ అట్కిన్సన్' ('మిస్టర్ బీన్' కామిక్ పాత్ర పోషించే నటుడు) చాలా మందికి కమెడియన్‌గానే తెలుసు. కానీ.. మిస్టర్ బీన్ ఓ మంచి కార్ ప్రియుడు. ఇతనికి సూపర్ కార్లంటే మహా ఇష్టం.

కాగా.. ఇప్పుడు మిస్టర్ బీన్ ఉపయోగించిన కార్లలో ఓ పాపులర్ కారు అమ్మకానికి వచ్చింది. రోవన్ అట్కిన్సన్ దాదాపు రెండు సార్లు యాక్సిడెంట్ చేసిన మెక్‌లారెన్ ఎఫ్1 సూపర్‌కారును చివరకు అమ్మేయాలని బీన్ నిర్ణయించుకున్నాడు. అట్కిన్సన్ ఈ కారును 5.40 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. ఈ కారు మరమ్మత్తుల కోసం ఆయన బగానే ఖర్చు చేశారు.

Rowan Atkinson McLaren F1

ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కారును 80 లక్షల పౌండ్లకు విక్రయించాలని నిర్ణయించారు. గతంలో ఈ కారు రిపేరు కోసం ఆయన ఏకంగా 9 లక్షల పౌండ్లను వెచ్చించారు. ప్రపంచంలో కెల్లా అత్యధికమైన మరమ్మత్తుల్లో కెల్లా ఇదొకటిగా అప్పట్లో ఇది రికార్డును కూడా సృష్టించింది. ఈ కారుకు రెండు సార్లు మరమ్మత్తులు చేసినప్పటికీ, దీని విలువ మాత్రం ఇంత భారీగా పలకడానికి కారణం దీనిని మిస్టర్ బీన్ ఉపయోగించడమే.

పశ్చిమ లండన్‌లోని టేలర్ అండ్ క్రాలే అనే ప్లేస్‌లో ఈ కారును విక్రయించనున్నారు. మెక్‌లారెన్ ఎఫ్1 కారులో 6.1 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 241 మైళ్లు. ఇది కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ మెక్‌లారెన్ కారులో మూడు సీట్లు ఉంటాయి. ఇందులో డ్రైవర్ మధ్య సీటులో కూర్చొని డ్రైవ్ చేస్తాడు, వెనుక సీట్లలో ఇద్దరు ప్యాసింజర్లు కూర్చోవచ్చు. మరి బాగుంది కదూ మన మిస్టర్ బీన్ మెక్‌లారెన్ కారు.

Most Read Articles

English summary
Rowan Atkinson's twice crashed McLaren F1 hypercar is up for sale with a price tag of USD £ 8 million ($ 12 million). The car was bought by the famous hollywood actor for £ 540,000.
Story first published: Tuesday, January 27, 2015, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X