2015 టోక్యో ఆటో సెలూన్: సుజుకి ఆల్టో ఆర్ఎస్ టర్బో

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఆల్టో బ్రాండ్‌లో కంపెనీ ఓ పవర్‌ఫుల్ వెర్షన్‌ను డిజైన్ చేసింది. 'సుజుకి ఆల్టో ఆర్ఎస్ టర్బో' (Suzuki Alto RS Turbo) కంపెనీ గడచిన డిసెంబర్ నెలలో ఆవిష్కరించిన కాన్సెప్ట్ కారును ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 2015 టోక్యో ఆటో సెలూన్‌లో ప్రదర్శనకు ఉంచింది.

జపాన్ మార్కెట్లో సుజుకి విక్రయిస్తున్న స్టాండర్డ్ వెర్షన్ ఆల్టో మోడల్‌కి టర్బోచార్జ్డ్ వెర్షనే ఈ ఆల్టో ఆర్ఎస్ టర్బో. ఈ కారులో, 660సీసీ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Suzuki Alto RS Turbo Displayed At 2015 Tokyo Auto Salon

ఈ ఇంజన్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు, ఇదివరకటి ఇంజన్లతో పోల్చుకుంటే ఇది చాలా తేలికగా (సుమారు 60 కేజీలు) ఉంటుంది. సుజుకి అందిస్తున్న స్టాండర్డ్ వెర్షన్ కీ (Kei) కార్లలో 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ లేదా సివిటిని ఆఫర్ చేస్తున్నారు. కాగా.. ఈ కొత్త సుజుకి ఆల్టో ఆర్ఎస్ టర్బో మోడల్‌లో కూడా ఇదే ట్రాన్సిమిషన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

స్టాండర్డ్ సుజుకి ఆల్టోకి ఈ కొత్త సుజుకి ఆల్టో ఆర్ఎస్ టర్బో మోడల్‌కి అనేక కాస్మోటిక్ అప్‍‌గ్రేడ్స్ ఉంటాయి. వైట్ కలర్ బాడీ పెయింట్, రెడ్ డీకాల్స్ అండ్ డీటేలింగ్స్, వెనుక వైపు ఆర్ఎస్ బ్యాడ్జ్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్ వంటి అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ కారులో పెద్ద 17-ఇంచ్ రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. మార్చ్ 2015 నాటికి ఈ స్పోర్టీ మోడల్ జపాన్ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

Most Read Articles

English summary
Japanese carmaker Suzuki has showcased its Alto RS Turbo at the ongoing 2015 Tokyo Auto Salon.
Story first published: Tuesday, January 13, 2015, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X