టాటా నానో మార్కెట్ నుంచి తొలగిపోదు; ఏఎమ్‌టి వెర్షన్ వస్తోంది!

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రజల కారు టాటా నానో అమ్మకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించి వేయచ్చొనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా.. ఈ రూమర్లను టాటా మోటార్స్ ఖండిస్తోంది. నానో ఉత్పత్తిని నిలిపివేసేది లేదని, ఇంకా ఇందులో మరిన్ని కొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో చవకైన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి సెలెరియో, కొత్త ఆల్టో కె10, టాటా జెస్ట్ వంటి కార్లలో ఏఎమ్‌టి వెర్షన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ అందిస్తున్న నానో కారులో కూడా ఏఎమ్‌టి వెర్షన్‌ను పరిచయం చేయనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కూడిన టాటా నానో మార్కెట్లోకి రానుంది.

tata nano automatic

వాస్తవానికి టాటా మోటార్స్ గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో 'టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్' పేరిట ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) వెర్షన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ వేరియంట్ కూడా కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ మాదిరిగానే సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)గా చెప్పుకునే ఈ గేర్‌బాక్స్, మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్‌తో సమానమైన మైలేజీని ఆఫర్ చేస్తూనే, ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌లోని సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు, దీని ధర సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కన్నా తక్కువగా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata Motors is ready to do just about everything possible to hike sales of the Nano. Introduced to the world in 2009 as the world's cheapest car, the car has had every possible upgrade till date, including future plans of introducing a AMT variant of the Nano.
Story first published: Saturday, January 31, 2015, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more