టొయోటా నుంచి కాంపాక్ట్ సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ!

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న కాంపాక్ట్ సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు జపనీస్ కార్ కంపెనీ టొయోటా కూడా తహతహలాడుతున్నట్లు సమాచారం. సబ్-ఫోర్ మీటర్ క్యాటగిరీలో (నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండే విభాగంలో) టొయోటా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని, సెడాన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టొయోటా నుంచి రానున్న ఉత్పత్తి, ఈ విభాగంలోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అలాగే, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కంపెనీ ప్రవేశపెట్టనున్న ఉత్పత్తి ఈ విభాగంలోని స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, టాటా జెస్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంటుంది.

Toyota

టొయోటా ఈ రెండు ఉత్పత్తులను వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే 2016 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచే ఆస్కారం ఉంది. కాంపాక్ట్ కార్లపై (నాలుగు మీటర్ల తక్కువ పొడవు ఉండే కార్లపై) భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న రాయితీలను పొంది, సరసమైన ధరకే ఈ కార్లను అందించడం ద్వారా పోటీని తట్టుకోవాలని టొయోటా భావిస్తోంది.
Most Read Articles

English summary
Japanese automobile manufacturer Toyota is betting high on Indian market. They are planning on introducing a new compact SUV and sedan, which will fall in the sub-four-metre category.
Story first published: Tuesday, March 31, 2015, 15:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X