ఇకపై ఉబెర్ టాక్సీలలో డ్రైవర్ రేప్ చేస్తాడన్న భయం ఉండదు!

By Ravi

ఒంటరిగా వచ్చే మహిళా ప్యాసింజర్లపై ఉబెర్ టాక్సీ డ్రైవర్లు చేస్తున్న అరాచకాలు ఇటీవలి కాలంలో ఎక్కువైన సంగతి తెలిసినదే. మనదేశంలోనే కాకుండా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఉబెర్ డ్రైవర్ల ఘాతుకానికి బలైన మహిళలు ఉన్నారు.

అయితే, భవిష్యత్తులో ఉబెర్ టాక్సీలలో ఇలాంటి డ్రైవర్ల సమస్య ఉండదు. అసలు ఫ్యూచర్ ఉబెర్ టాక్సీలలో డ్రైవర్లే ఉండరు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ రహిత (సెల్ఫ్-డ్రైవింగ్/డ్రైవర్‌లెస్) కార్లను అభివృద్ధి చేసేందుకు ఉబెర్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. గూగుల్ నుంచి రానున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీకి చెక్ పెట్టేందుకే ఉబెర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేసేందుకు గాను పిట్స్‌బర్గ్ వద్ద ఉబెర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. కార్నెగీ మెలన్ ఫ్యాకల్టీ, విద్యార్థులతో కలిసి డ్రైవర్ రహిత కార్లకు రూపకల్పన చేయనున్నారు. వీరంతా మ్యాపింగ్ అండ్ వెహికల్ సేఫ్టీ అండ్ ఆటోమొబైల్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించనున్నారు.

Uber

డ్రైవర్ లేకుండా కారును సురక్షితంగా కంట్రోల్ చేయవచ్చని నిరూపించింది గూగుల్. వాస్తవానికి గూగుల్ కంటే ముందుగా ఇతర కార్ కంపెనీలు ఈ టెక్నాలజీనిపై పనిచేస్తున్నప్పటికీ, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకుంది. ఇప్పటికే గూగుల్ తమ కార్లను రియల్ రోడ్లపై టెస్ట్ చేసేందుకు అనుమతిని కూడా తెచ్చుకుంది.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే జీవం పోసుకుంటున్న ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, గూగుల్ పోటీని తట్టుకుంటుందంటారా..? ఏదైతేనేం.. ఇలాంటి డ్రైవర్‌లెస్ కార్లు అందుబాటులోకి వస్తేనైనా, మహిళలపై అత్యాచాల వంటి సంఘటనలు తగ్గుతాయోమో..!

Most Read Articles

English summary
Uber has formed a partnership with Carnegie Mellon University to develop driverless car and mapping technology, potentially putting the car-hailing company in direct competition with one of its biggest investors Google.
Story first published: Monday, February 9, 2015, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X