టోక్యో మోటార్ షోలో స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్‌ని ఆవిష్కరించిన యమహా

By Anil

జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారి సంస్థ యమహా తన స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారును 2015 టోక్యో మోటార్ షోలో ఆవిష్కరించింది. రెండు సీట్లు మాత్రమే కలిగిన ఈ స్పోర్ట్స్ కారు డిజైన్ ఐస్ట్రీమ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ వారి ఆధారంతో తయారు చేశారు. మరియు దీని డిజైన్‌ని అభివృద్ది చేసిన వారు గొర్డాన్ ముర్రే డిజైన్ లిమిటెడ్. వీరు దీనిని పూర్తిగా అతి తక్కువ బరువు ఉండే విధంగా సృష్టించారు. మరియు ఫార్ములా వన్ టెక్నాలజీ నుండి సేకరించిన హై రిజిడిటి స్ట్రక్చర్‌ని ఇందులో అందించారు.
Also Read: టోక్యో మోటార్ షోలో ఆవిష్కరించిన మరిన్ని వాహనాల గురించి తెలుసుకోండి.

టోక్యో మోటార్ షోలో విడుదలైన ఈ యమహా స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారుకు చెందిన మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 స్పోర్ట్స్ కారు బరువు :

స్పోర్ట్స్ కారు బరువు :

ఈ యమహా స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారు బరువును అతి తక్కువగా ఉండే విధంగా రూపొందించారు. దీని బరువు కేవలం కేవలం 900 కిలోలు మాత్రమే. ఇది అతి తక్కువ బరువున్న కారుగా పేరుగాంచిన లోటస్ ఎలిసి బ్రిటిష్ తయారీదారులు రూపొందించిన దాని కన్నా తక్కువ బరువు కలదు.

ఇంటీరియర్:

ఇంటీరియర్:

ఈ యమహా స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారు డిజైన్‌కు అద్యక్షత వహించినది టయోటా మాజీ డిజైనర్‌గా పని చేసిన డెజి నగాయా. ఇతని ఆలోచనల్లో నుండి ఉట్టిపడినదే ఈ అత్బుతమైన డిజైన్.దీని ఇంటీరియర్ పూర్తిగా డార్క్ గ్రే ఫినిషింగ్‌ రూపొందించారు. మరియు బ్రౌన్ కలర్ గల కార్బన్ ఫైబర్ మరియు మెటాలిక్ ఫినిషింగ్ తో తీర్చిదిద్దారు.

 టోక్యో మోటార్ షోలో స్పోర్ట్స్ కార్ కాన్సెప్ట్‌ని ఆవిష్కరించిన యమహా

టోక్యో మోటార్ షోలో యమహా కంపెని మన ఊహలకందని మోడళ్లను ఆవిష్కరించింది వాటిని తెలుసుకోవడానికి. ముందుకు వెళ్ళండి. ఈ యమహా స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారుకు చెందిన ఇంజన్ మరియు ఇతర ఫీచర్లను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు.

యల్‌యమ్‌డబ్ల్యూ-ఎమ్‌డబ్ల్యూటి-9 :

యల్‌యమ్‌డబ్ల్యూ-ఎమ్‌డబ్ల్యూటి-9 :

యమహా కంపెనీ లీనింగ్ మల్టీ-వీల్ (యల్‌యమ్‌డబ్ల్యూ) కాన్సెప్ట్ మోడల్‌ని స్పోర్ట్స్ రైడింగ్ వేరియంట్‌గా విడుదల చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ యల్‌యమ్‌వి వాహనం ముందు వైపున రెండు చక్రాలను కలిగి ఉంటుంది. మరియు ఇందులో 849సీసీ గల ఇన్-లైన్ మూడు సిలిండర్ల ఇంజన్ కలదు.

 మోటోబోట్ వెర్షన్.1:

మోటోబోట్ వెర్షన్.1:

ఈ మోటార్ సైకిల్‌ని మానవరూప రోబో స్వారీ చేస్తోంది కదూ. ఇది రోబోటిక్ టెక్నాలజీ‌తో రూపొందించబడిన యమహా యొక్క స్వయంప్రతిపత్తితో వచ్చిన మోటార్ సైకిల్.

రెసొనేటర్ 125 :

రెసొనేటర్ 125 :

థ్రిల్‌ను కోరుకునే ప్రతి యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన తక్కువ బరువు గల కాంపాక్ట్ మోటార్ సైకిల్ ఇది. ఈ రెసొనేటర్ 125 లో 125సీసీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

వైపిజె-యమ్‌టిబి కాన్సెప్ట్ :

వైపిజె-యమ్‌టిబి కాన్సెప్ట్ :

ఇది విద్యుత్ ఆధారిత పర్వాత రోహణ కు ఉపయోగించే సైకిల్ ఇది. దీనిని ప్రత్యేకించి ఎటువంటి భూబాగంలోనైనా స్వేఛ్చగా స్వారీని ఆస్వాదించడానికి ఎక్కవగా ఇష్టపడే పెద్దల కోసం రూపొందించినట్లు దీని తయారి దారులు తెలిపారు.

కొత్త తరంమ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసు కోండి.

జపాన్ అణువిపత్తు కాలం నాటి ప్రదేశాలు-నిర్ఘాంత పోయే సత్యాలు

మిత్సుబిషి నుండి ఎలక్ట్రిక్ కాంపాక్ట్ యస్‌యువి కారు

నిస్సాన్ నుండి వచ్చిన ఐడియస్ ఎలక్ట్రిక్ కారు

నీటితో నడిచే హోండా కారు

Most Read Articles

English summary
Yamaha Sports Car Concept Revealed At Tokyo Motor Show
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X