విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపితే ఇవి పాటించండి

By N Kumar

ఇండియాకు చెందిన చాలా మంది వారి వృత్తిరిత్యా వివిధ దేశాల్లో స్థిరపడి ఉంటారు. అందులో కొన్ని దేశాలు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తే, కొన్ని దేశాలు అనుమతించవు. అనుమతించినప్పటికీ కొన్ని కఠిన నింభందనలు విధిస్తాయి. వివిధ దేశాలలో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌‌తో డ్రైవింగ్ చేసే వారికి ఉన్న నియమాలు మరియు ఆ దేశాలలో ఉన్న కొన్ని డ్రైవింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం రండి.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా

  • ఫన్ ఫ్యాక్ట్; ఆస్ట్రేలియాలోని ప్రతి కారు ఏడాదికి సగటున 14,000 కిలోమీటర్లు నడుస్తుంది. మరియు 130 లక్షల కన్నా ఎక్కువ కార్లు ఏడాదికి 182 బిలియన్ కిలోమీటర్లు నడుస్తున్నాయి.
  • ఆస్ట్రేలియాలో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను కూడా కలిగి ఉండాలి.
  • న్యూజిలాండ్

    న్యూజిలాండ్

    • చిట్కా: న్యూజిలాండ్‌లో మీ వాహనాన్ని వాహనాలు వెళ్లే దిశకు వ్యతిరేకంగా పార్కింగ్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద వాహనాలు ముందుకు వెల్లే దిశలోనే పార్కింగ్ చేయండి.
    • ఫన్ ఫ్యాక్ట్ : 40 లక్షల జనాభాలో (పిల్లలతో కలిపి) సుమారుగా 25 లక్షల మంది కార్లను కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ రేటులో కార్ల ఓనర్లున్న దేశంగా న్యూజిలాండ్ నిలిచింది.
    • సౌత్ ఆఫ్రికా

      సౌత్ ఆఫ్రికా

      • చిట్కా: ఇక్కడ పెట్రోల్ ష్టేషన్లకు మరియు నగరాలకు మధ్య గల దూరం గణనీయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్లినపుడు మీ కారులో ఇంధనం పుష్కలంగా ఉండేట్లు చూసుకోవడం మంచిది.
      • ఫన్ ఫ్యాక్ట్: మీరు వెళ్లే దారిలో అడవి జంతువులు కనబడితే వాటికి తినుబండరాలు పెట్టేరు, అలా చేయడం ఇక్కడ నేరం. దీనికి ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
      • సౌదీ అరేబియా

        సౌదీ అరేబియా

        • శాడ్ ఫ్యాక్ట్: ప్రపంచంలో మరే దేశంలోని విధంగా ఇక్కడ మహిళను డ్రైవింగ్ చేయకూడదు. ఒక వేళ భారతీయ మహిళలకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నా అక్కడ అర్హులు కాదు.
        • ఫన్ ఫ్యాక్ట్: సౌదీ అరేబియాలోని ప్రతి నలుగురిలో ఒక్కరికి కారు ఉంటుంది.
        • ఇండియన్ డ్రైవింగ్స్ లైసెన్స్ ఉన్న వారికి అత్యంత కఠినమైన నియమాలతో డ్రైవింగ్‌కు అనుమతిస్తారు.
        • చైనా

          చైనా

          • చిట్కా: పగటి పూట కూడా ఇక్కడి రోడ్ల మీద హెడ్ లైట్లను ఆన్‌ చేసుకుని వెళ్లాల లేదంచే ఫైన్ కట్టాల్సి వస్తుంది.
          • ఫన్ ఫ్యాక్ట్: చైనాలోని డ్రైవింగ్ లైసెన్స్‌కు నిర్వహించే పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. చైనాలోని జుహాయ్‌లో పాస్ పర్సంటేజ్ 7 శాతంగానే ఉంది.
          • ఇక్కడ ఇండియన్ లైసెన్స్ చెల్లదు, కాబట్టి చైనా వారి నియమాల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
          • హాంగ్‌కాంగ్

            హాంగ్‌కాంగ్

            • ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడ కొత్త కారు ఆరు సంవత్సరాల వయస్సు దాటితే ప్రతి ఏడాది కూడా రోడ్డు మీద తిరగడానికి పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపించుకోవాల్సి ఉంటుంది.
            • హాంక్‌కాంగ్‌లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో 12 నెలల పాటు డ్రైవింగ్ చేసుకోవచ్చు.
            • జపాన్

              జపాన్

              • ఫన్ ఫ్యాక్ట్ : జపాన్‌లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆ కారుకు సరిపడే పార్కింగ్ స్థలం తమ ఇంటికి దగ్గర్లో ఉన్నట్లు సంభందిత అధికారుల నుండి పొందిన సర్టిఫికేట్ చూపాల్సి ఉంటుంది.
              • చిట్కా: ఇక్కడ మధ్య సేవించిన డ్రైవర్ నడుపుతున్న కారులో మిగతా వారు శిక్షార్హులే.
              • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో జపాన్‌లో ఏడాది పాటు ఎటువంటి అభ్యంతరం లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు.
              • రష్యా

                రష్యా

                • చిట్కా: రష్యాలో దమ్ము పట్టిన కారును నడపడం చట్టవిరుద్దం. కాబట్టి రష్యాలో కారును క్లీన్ చేసుకుని నడపడం మంచిది లేదంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
                • ఫన్ ఫ్యాక్ట్: దారి మధ్యలో లిఫ్ట్ అడిగే వారికి లిఫ్ట్ ఇవ్వడం చట్ట విరుద్దం.
                • ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆరు నెలలు మత్రమే పరిమితి ఉంది.
                • ఫిన్లాండ్

                  ఫిన్లాండ్

                  • నియమం: పగలు మరియు రాత్రి అన్ని వేళల్లో హెడ్ లైట్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి.
                  • ఫన్ ఫ్యాక్ట్: ఫిన్లాండులో కార్ల ద్వారా జరిగే అడవి జింకల ప్రమాదాన్ని అరికట్టడానికి, ఈ దేశంలో ఉన్న జింకల సంరక్షణ సభ్యులు జింకల కొమ్ములకు మెరిసే పదార్థంతో స్ప్రే చేశారు. కార్ల నుండి వెలువేడే కాంతి కొమ్ముల మీద పడి ప్రకాశించి ప్రమాదాలను తప్పించవచ్చు అని వారి కథనం.
                  • భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌‌తో 12 నెలల వరకు డ్రైవింగ్ చేయవచ్చు.
                  • స్వీడెన్

                    స్వీడెన్

                    • చిట్కా; స్వీడెన్‌లో కార్లను నడిపేటపుడు అన్ని వేళలా హెడ్ లైట్లను ఆన్‌లో ఉంచుకుని వాటికి డిమ్ అండ్ డిప్ ఆప్షన్‌ను అమర్చుకోవాలి.
                    • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉన్నపుడు ఇక్కడ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది.
                    • జర్మనీ

                      జర్మనీ

                      • ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడున్న హై వే ల మీద ప్రయాణిస్తున్నపుడు ఇంధనం లేకుండా వెళితే మీ లైసెన్స్ ఆరు నెలల పాటు క్యాన్సిల్ చేస్తారు. మరియు హై వే ల మీద స్పీడ్ లిమిట్స్ ఉండవు మీ కారులోని గరిష్ట వేగంతో ఇక్కడ ప్రయాణించవచ్చు.
                      • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు కేవలం ఆరు నెలలు మాత్రమే పరిమితి కలదు.
                      • బెల్జియం

                        బెల్జియం

                        చిట్కా: బెల్జియం రహదారుల మీద కారు పాడైపోయినపుడు రిపేరి చేసుకునే సమయంలో ఫ్లోరోసెంట్ స్లీవ్ లెస్ కోటు ధరించాలి. లేదంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

                        ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు ఆరు నెలల వరకు వారి వాహనాలతో రోడ్లెక్కవచ్చు.

                        ఫ్రాన్స్

                        ఫ్రాన్స్

                        • ఫన్ ఫ్యాక్ట్: ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో కేవలం ఒకటి మాత్రమే స్టాప్ బోర్డ్ ఉంది.
                        • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇక్కడ కేవలం 12 నెలల పరిమితి మాత్రమే కలదు.
                        •  స్విట్జర్లాండ్

                          స్విట్జర్లాండ్

                          • నియమం: పెద్ద హెడ్‌లైట్లు అన్ని వాహనాలకు అన్ని వేళలా తప్పనిసరి
                          • వింత సత్యం : ఇక్కడ ఆది వారాల్లో కార్లను కడగడం మరియు శుభ్రం చేయడం చట్టవిరుద్దం.
                          • భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రావింగ్ పర్మిట్ కూడా తప్పనిసరి.
                          • ఇటలీ

                            ఇటలీ

                            • ఫన్ ఫ్యాక్ట్: ఇటలీలో అన్ని వాహనాలు ఎరుపు లేదా పసువు పరావర్తనం చెందే జాకెట్లను మరియు త్రికోణాకృతిలో ఉండే హెచ్చరిక బోర్డులను ప్రమాదం జరిగినపుడు వినియోగించేందుకు వెంట తీసుకెళ్లాలి.
                            • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ ఉండాలి.
                            • స్పెయిన్

                              స్పెయిన్

                              • ఫన్ ఫ్యాక్ట్: మీరు డాక్టర్ సూచించిన కళ్లద్దాలను వాడుతున్నారా ? అయితే స్పెయిన్‌లో డ్రైవింగ్ చేస్తుంటే అదనపు కళ్లద్దాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
                              • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ ఉండాలి.
                              • యునైటెడ్ కింగ్‌డమ్

                                యునైటెడ్ కింగ్‌డమ్

                                • ఫన్ ఫ్యాక్ట్: రహదారుల్లో మరియు నిర్మాణం చేపట్టిన ప్రాంతాల్లో రాత్రి 11:30 నుండి ఉదయం 7 గంటల మధ్యలో హారన్ శబ్దం చేయడం చట్టవిరుద్దం.
                                • ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో 12 నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
                                • కెనడా

                                  కెనడా

                                  • ఫన్ ఫ్యాక్ట్ : కెనడా రోడ్ల మీద రెడ్ సిగ్నల్ పడినపుడు కుడివైపుకు వాహనాలు వెళ్లడం చట్టబద్దమైన నియమమే, కాని కెనడాలో భాగమైన క్యూబెక్‌లో ఇలా చేయడం చట్ట విరుద్దం. క్యూబెక్‌కు వెళితే దీనిని గుర్తుంచుకోండి.
                                  • ఇండియన్ డ్రైలింగ్ లైసెన్స్ ఉన్న వారు ఇక్కడ ఆరునెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
                                  • అమెరికా

                                    అమెరికా

                                    • చాలా వరకు దేశాల్లో రెడ్ లైట్ పడిన తరువాత కుడివైపు వెళ్లడం నేరమేమి కాదు, కాని అమెరికాలో రెడ్ లైట్ పడిన తరువాత పాద చారులు రోడ్డు దాటిన తరువాత మాత్రమే కుడివైపుకు టర్న్ అవ్వాలి.
                                    • అమెరికాలో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడానికి సంక్లిష్టమైన ఆంక్షలను పాటించాల్సి ఉంటుంది.
                                    • మెక్సికో

                                      మెక్సికో

                                      • ఫన్ ఫ్యాక్ట్: ఇక్కడ మీకు ఎదురుగా వస్తున్న వాహనం ఫ్లాష్ ఇస్తున్న సమయం ఎదురుగా వస్తున్న వారు, వారి ముందు ఏదో ప్రమాదం ఉందని గ్రహించాలి.
                                      • ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఇక్కడ సుమారుగా 12 నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
                                      • బ్రెజిల్

                                        బ్రెజిల్

                                        • ఫన్ ఫ్యాక్ట్: చాలా వరకు ఇండికేటర్లను రోడ్ డైరెక్షన్స్ కోసం వినియోగిస్తారు. కాని ఇక్కడ అలా కాదు. ఎడమ వైపు ఇండికేటర్ పడితే ఎడమ వైపుకు మళ్లడం మంచిది కాదు అని మరియు కుడి వైపుకు ఇండికేటర్ ఉపయోగిస్తే కుడివైపుకు వెళ్లడం మంచిది అని అర్థం.
                                        • వింత నిజం: బ్రెజిల్‌లో స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేయకూడదు.
                                        • ఇండియన్ డ్రైవింహ్ లైసెన్స్‌తో ఇక్కడ ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయవచ్చు.
                                        • విదేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌ వాడితే ఇవి పాటించండి

                                          ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు.

                                          ఇండియాలో వివిధ రకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్ల వెనకున్న ఆంతర్యం ఏమిటి ?

Most Read Articles

English summary
21 Things You Need To Remember When You Are Driving On An Indian License Around The World
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X