జెనీవా మోటార్‌ షోలో 17.82 కోట్ల విలువైన బుగట్టి చిరాన్

By Anil

జెనీవాలో జరుగుతున్న మోటార్‌ షోలో బుగట్టి వారి విజయవంతమైన వేరాన్ యొక్క ప్రతి రూపం చిరాన్ కారును ప్రదర్శించింది. దీని ధర ఏకంగా 2.4 మిలియన్ యూరోలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా 17.82 కోట్లుగా ఉంది.

బుగట్టి చిరాన్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

 చిరాన్ ఇంజన్ వివరాలు

చిరాన్ ఇంజన్ వివరాలు

బుగట్టి తమ చిరాన్ కారులో 8.0-లీటర్ కెపాసిటి గల క్వాడ్ టుర్బో డబ్ల్యూ16 ఇంజన్ కలదు.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఈ ఇంజన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 1,479 బిహెచ్‌పి పవర్ మరియు 2,000 నుండి 6,000 ఆర్‌పిఎమ్ మధ్య 1,600 ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది.

వేగం వివరాలు

వేగం వివరాలు

  • 0 నుండి 100 కిమీ వేగం-2.5 సెకండ్ల కాలంలోనే
  • 0 నుండి 200 కిమీ వేగం-6.5 సెకండ్ల కాలంలోనే
  • 0 నుండి 300 కిమీ వేగం- 13.6 సెకండ్ల కాలంలోనే
  • గరిష్ట వేగం గంటకు 420 కిలోమీటర్లు
  • గేర్‌బాక్స్ వివరాలు

    గేర్‌బాక్స్ వివరాలు

    బుగట్టి వారు తమ చిరాన్ కారులో డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ కలదు. ఇది ఇంజన్ నుండి విడుదలయ్యే పవర్‌ను 4-వీల్ డ్రైవ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా చేస్తుంది.

    అతి తక్కువ బరువుతో

    అతి తక్కువ బరువుతో

    బుగట్టి వారు ప్రస్తుతం విడుదల చేసిన చిరాన్ కారు సాదారణ వేరాన్ కారు కన్నా 1995 కిలో ల తక్కువ బరువుతో తయారు చేశారు. ఇందుకోసం దీనిలో ఎక్కువగా కార్బన్ ఫైబర్ విడిభాగాలను ఉపయోగించారు.

    డ్రైవింగ్ మోడ్స్

    డ్రైవింగ్ మోడ్స్

    బుగట్టి వారు ఈ చిరాన్ కారులో ఐదు విభిన్న డ్రైవింగ్ మోడ్స్‌ను అందించారు.

    • లిఫ్ట్
    • ఆటో
    • ఆటోభాన్
    • హ్యాండ్లింగ్
    • టాప్ స్పీడ్
    • స్పీడ్ కీ

      స్పీడ్ కీ

      ఈ కారును అత్యధిక వేగం వద్ద నడపడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్పీడ్ కీన్ ఆన్ చేయడం ద్వారా, ఈ బుగట్టి చిరాన్ కారును 420 కిలోమీటర్ల వేగం వరకు నడుపవచ్చు.

      బ్రేకులు

      బ్రేకులు

      చిరాన్ కారును ఎంతటి వేగం వద్ద అయినా నిలపడానికి ముందు వైపున 420 ఎమ్‌ఎమ్ చుట్టుకొలత మరియు వెనుక వైపున 400 ఎమ్‌ఎమ్ చుట్టుకొలత గల కార్బన్ సిరామిక్ బ్రేకులు అందించారు.

      వేరాన్ కారులో

      వేరాన్ కారులో

      వేరాన్ కారు గంటకు 100 కిలోమీటర్లు వేగంలో ఉన్నప్పుడు బ్రేకులు వినియోగిస్తే 31.3 మీటర్ల దూరంలోపు కారును ఆపుతుంది మరియు 200 కిలోమీటర్లు వేగంలో ఉన్నప్పుడు బ్రేకులు ఉపయోగిస్తే 125 మీటర్లు దూరంలో మరియు 300 కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు 275 మీటర్ల దూరంలోపు కారును ఆపవచ్చు.

      టైర్లు మరియు చక్రాలు

      టైర్లు మరియు చక్రాలు

      చిరాన్ కారులో ముందు వైపున 20 అంగుళాలకు 285/30 మరియు 21-అంగుళాల చక్రాలకు 355/25 కొలతలతో మిచేలియన్ టైర్లను అందించారు.

       డిజైన్

      డిజైన్

      బుగట్టి వారు ఎల్లప్పుడూ తమ అన్ని కార్లలో డిజైన్‌కు పెద్ద పీట వేస్తారు. అందులో భాగంగానే నూతన డిజైన్‌ను అందించారు. అయితే గత ఏడాదిలో జరిగిన ఫ్రాంక్ ఫర్ట్ ఆటో షోలో ప్రదర్శించిన బుగట్టి విజన్ గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

      ఇంటీరియర్

      ఇంటీరియర్

      బుగట్టి చిరాన్ ఇంటీరియర్‌లో కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియం అలంకరనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంస్ట్రుమెంటల్ ప్యానెల్ స్పీడో మీటర్ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు డ్రైవింగ్‌మోడ్స్‌కు చెందిన అన్ని వివరాలు దీని ద్వారా పొందవచ్చు.

      ఫీచర్లు

      ఫీచర్లు

      చిరాన్‌లో సెంటర్ కన్సోల్, బుగట్టి మిర్రర్స్, ముందు వైపు ఎయిర్ ఇంటేక్స్ ప్లాంక్స్, ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్. కూల్డ్ గ్లూవ్స్, నాలుగు స్పీకర్లు వంటి ఫీచర్లు ఇందులో కలవు.

      ధర వివరాలు

      ధర వివరాలు

      బుగట్టి వారి చిరాన్ వారి కారును బుక్ చేసుకోవాలనుకునే వారు 2.4 మిలియన్ యురోలను లేదా 17.82 కోట్లునిు చెల్లించాల్సి ఉంటుంది.

      అందుబాటులోకి

      అందుబాటులోకి

      బుగట్టి వారు కేవలం 500 చిరాన్ కార్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో ఇప్పటికే 180 కార్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు తెలిపారు.

      మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు.....
      • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
      • 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిబడిన కార్ల గురించి తెలుసుకోండి.
      • ఏ బైకు కొనాలో అని అయోమయంలో ఉన్నారా ? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bugatti Launches The Veyron's Successor - The 1479bhp Chiron
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X