చైనా మోటార్ షో నుండి భారత్‌లోకి రానున్న కొన్ని కార్లు

By Anil

ఆసియా ఖండం మొత్తానికి కార్లను పరిచయం చేయాలంటే ఉండే అతి పెద్ద ఏకైక మోటార్ షో బీజింగ్ షో. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కార్ల మార్కెట్ ఎక్కువ గిరాకీ ఉన్నది కూడా చైనాలోనే. చైనా మార్కెట్లోకి చాలా వరకు తయారీ సంస్థలు అత్భుతమైన కార్లను బీజింగ్ మోటార్ షో ద్వారా పరిచయం చేశాయి. అయితే ఆసియాలో భాగంగా ఉన్న ఇండియాలోకి చైనాలో ప్రదర్శించబడిన కొన్ని కార్లు రానున్నాయి. ఈ కార్లు గురించి క్రింది కథనంలో కలవు ఓ లుక్కేసుకుందామా...

1. రెనో కొలియోస్

1. రెనో కొలియోస్

రెనో కొలియోస్ మన ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే ఉంది కదా మరీ కొత్తగా పరిచయం చేయడం ఏంటని అనుకుంటున్నారా ? రెనో రెండవ తరానికి చెందిన కొలియోస్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొలియోస్ స్థానంలో త్వరలోనే దీనిని ప్రవేశపెట్టనుంది.

2. మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌‌డబ్ల్యూబి

2. మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఎల్‌‌డబ్ల్యూబి

చైనా మార్కెట్లో లాంగ్ వీల్ బేస్(ఎల్‌‌డబ్ల్యూబి) ఉన్న కార్లకు ఎక్కువ గిరాకీ ఉంది. అందుకే మెర్సిడెస్ బెంజ్ బీజింగ్ ఆటో షో ద్వారా ఇ-క్లాస్ ఎల్‌‌డబ్ల్యూబి కారును చైనీయులకు పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాదికి గాను మొత్తం 12 కార్లను ఉత్పత్తి చేయాలని ప్రకటించింది అందులో ఇది కూడా ఒకటిగా ఉండనుంది.

3. పోర్షే 718 కేమాన్

3. పోర్షే 718 కేమాన్

జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల తయారీ సంస్థ పోర్షే బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించింది. ఇందులో పోర్షే 4-సిలిండర్లు గల టర్భో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. ముందున్న ఆరు సిలిండర్ల స్థానంలో ఇది వచ్చింది.

4. ఆడి టిటి ఆర్ఎస్

4. ఆడి టిటి ఆర్ఎస్

ఆడి సంస్థ జర్మనీకు చెందిన మెర్సిడెస్ బెంజ్ నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది. మెర్సిడెస్ బెంజ్ తరువాత దేశీయ మార్కెట్లో అత్యంత విలాసవంతమైన కార్లను అందిస్తున్నది ఆడి. బీజింగ్ మోటార్ షోలో ఆడి తమ టిటి ఆర్‌ఎస్ కారును ప్రదర్శించింది. ప్రస్తుతం టిటి మోడల్ కారు దేశీయంగా అందుబాటులో ఉంది. అయితే ఈ టిటి ఆర్‌ఎస్ కూడా మన మార్కెట్లోకి అడుగులు వేయనుంది.

5. హ్యుందాయ్ వెర్నా

5. హ్యుందాయ్ వెర్నా

బీజింగ్ మోటార్ షోలో విడుదల కావాల్సిన వాటిలో కాన్సెప్ట్ కారు ఒకటి. అది కూడా దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ వెర్నా కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. ఎలైట్ ఐ20 లాగే హ్యుందాయ్ ఈ వెర్నా కాన్సెప్ట్ కారును తీర్ఛిదిద్దింది. దేశీయంగా తయారీ ప్రారంభమైతే ఇక సంచనాలు సృష్టించడమే తరువాయి అన్నట్లుగా ఉంది ఈ కారు.

6. వోక్స్‌వ్యాగన్ టి-ప్రైమ్ జిటిఇ కాన్సెప్ట్

6. వోక్స్‌వ్యాగన్ టి-ప్రైమ్ జిటిఇ కాన్సెప్ట్

జర్మనీకు చెందిన వోక్స్‌వ్యాగన్ భవిష్యత్తుకు చెందిన ఎలక్ట్రిక్ కారు టి-ప్రైమ్ జిటిఇ కాన్సెప్ట్ ఇది. ప్రస్తుతం కాన్సెప్ట్ రూపంలో ఉన్న దానిని మాత్రమే ప్రదర్శించారు. దీనిని 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని రూపాన్ని బాగా గుర్తిస్తే ఆడి క్యూ 7 మరియు బెంట్లీ బెంట్యాగాను పోలి ఉంటుంది.

7. హోండా అవాన్సియర్

7. హోండా అవాన్సియర్

జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ దీనిని కాన్సెప్ట్ డి అనే పేరుతో గత ఏడాది షాంఘైలో ప్రదర్శించింది. ఉత్పత్తి సిద్దమైన దీనిని అవాన్సియర్‌గా సంభోదిస్తున్నారు. హోండా మోటార్స్ వారి ఎస్‌యువి ఫ్లాగ్ షిప్ మోడల్ అయిన అవాన్సియర్‌ను సిఆర్-వి మరియు బిఆర్‌-వి కన్నా పై స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయంగా దీనిని త్వరలో విడుదల చేయనున్నారు.

చైనా నుండి ఇండియాకు వస్తున్న కార్లు

కార్ల పండుగ: ఇండియన్ మార్కెట్లోకి వరుసగా విడుదల కానున్న 20 కార్లు

Most Read Articles

English summary
Cars That Would Soon Come To India From The 2016 Beijing Motor Show
Story first published: Saturday, April 30, 2016, 12:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X