లక్ష దాటిన హ్యుందాయ్ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువి ఎస్‌యువి బుకింగ్స్

By Anil

హ్యుందా క్రెటా కాంపాక్ట్ ‌ ఎస్‌యువి ప్రస్తుతం ఇండియన్ కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. గత ఏడాదిలో హ్యుందాయ్ దేశీయ మార్కెట్లోకి ఎక్కువ ప్రాధాన్యమున్న కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి క్రెటా ఎస్‌యువిని ప్రవేశ పెట్టింది. అప్పటి నుండి నేటి వరకు భారీ స్థాయిలో అమ్మకాలు మరియు బుకింగ్స్‌ను సాధిస్తోంది. కేవలం ఎనిమిది నెలల కాలంలోనే లక్ష బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.

లక్ష బుకింగ్స్ నమోదు చేసుకున్న క్రెటా ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

రికార్డు స్థాయిలో

రికార్డు స్థాయిలో

క్రెటా ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేసిన సమయం నుండి నేటి వరకు క్రెటా గురించి ఐదు లక్షల మంది ఎంక్వైరీ చేశారు. అందులో లక్ష మంది బుకింగ్ చేసుకున్నారు. అందులో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 56,000 మంది క్రెటా కార్లకు ఓనర్లయ్యారు.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ప్రస్తుతం క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

  • 1.6-లీటర్ పెట్రోల్ డ్యూయల్ విటివిటి
  • 1.4-లీటర్ యు2 సిఆర్‍‌డిఐ
  • 1.6-లీటర్ యు2 సిఆర్‌డిఐ డీజల్
  •  క్రెటాలోని ట్రాన్స్‌మిషన్ వివరాలు

    క్రెటాలోని ట్రాన్స్‌మిషన్ వివరాలు

    క్రెటా ఎస్‌యువిలో గల రెండు పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

    ఫీచర్స్

    ఫీచర్స్

    క్రెటాలో గల ఫీచర్లు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా డ్రైవర్ సీటును అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు, 7-అంగళాల పరిమాణం గల తాకే తెర

     హ్యుందాయ్ క్రెటాలో గల భద్రత పరమైన ఫీచర్లు

    హ్యుందాయ్ క్రెటాలో గల భద్రత పరమైన ఫీచర్లు

    ఇందులో కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు స్టెబిలిటి మేనేజ్‌మెంట్ వంటి భద్రతతో కూడిన అంశాలు కలవు.

     బెస్ట్ ఇన్ క్లాస్ వారంటీ

    బెస్ట్ ఇన్ క్లాస్ వారంటీ

    హ్యుందాయ్ మోటార్స్ వారు తమ క్రెటా కారు మీద అత్భుతమైన వారంటీ ప్రకటించారు. మూడు సంవసత్సరాల పాటు అపరిమిత కిలోమీటర్లు తిరగవచ్చు.

     ధృడమైన డిజైన్

    ధృడమైన డిజైన్

    హ్యుందాయ్ తమ క్రెటా ఎస్‌యువిను హైవి స్ట్రక్ట్చర్ తో తయారు చేశారు తద్వారా క్రెటా బాడీ మొత్తం ఎంతో భద్రంగా మరియు ధృడంగా ఉంటుంది.

     వెయిటింగ్ పీరియడ్

    వెయిటింగ్ పీరియడ్

    ప్రస్తుతం ఈ కొరియా ఆధారిత సంస్థ దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కూడా క్రెటా ఎస్‌యువిలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా బుకింగ్స్ భారీ స్థాయిలో పెరిగి వినియోగదారులకు ఎక్కువ కాలపరిమితిని ప్రకటించారు.

    ఉత్పత్తి పెంపు

    ఉత్పత్తి పెంపు

    క్రెటా ఎస్‌యువిల ఉత్పత్తిని ప్రస్తుతం 13,000 వరకు పెంచినట్లు తెలిపారు. అందులో కేవలం 3,000 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్ కోసం మరియు మిగిలిన వాటిని దేశీయంగా ఉన్న వినియోగదారులకు అందివ్వనున్నారు.

     మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...
    • మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా
    • దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
    • విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

Most Read Articles

English summary
Hyundai Creta Compact SUV Records Over 1 Lakh Bookings
Story first published: Tuesday, March 15, 2016, 18:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X